థియేటర్స్ లో జాతీయ గీతం అన్న దానికి వర్మ షాకింగ్ కామెంట్స్!

Ram Gopal Varma shocking comments on National Anthem in theatres

01:02 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma shocking comments on National Anthem in theatres

ఎప్పుడూ వార్తల్లో వుండే సంచలనానికి మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెన్షేషన్ వ్యాఖ్యలు చేసాడు. సినిమా థియేటర్స్ లో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంపై రామ్ గోపాల్ వర్మ వ్యంగంగా తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలు సంధించాడు. గౌరవం అనేది వ్యక్తిగతంగా ఉండాలేకానీ, కచ్చితంగా పాటించాలనే కండిషన్ పెడితే అసలకే మోసం రావచ్చనే ఒపీనియన్ ని వ్యక్తం చేశాడు. కేవలం థియేటర్లలోనే జాతీయగీతాన్ని ఎందుకు ప్రదర్శించాలని, షాపుల్లో ఎందుకు ప్రదర్శించకూడదని ప్రశ్నించాడు.

టీవీ ప్రోగ్రామ్, సీరియల్స్, రేడియో ప్రోగ్రామ్స్ ల్లో మాటేంటని తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. అలాగే న్యూస్ పేపర్ల ఫస్ట్ పేజీలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రింట్ చేయకూడదని ప్రశ్నించాడు. దీనిపై మరిన్ని ట్వీట్స్ చేశాడు. మరి మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary

Ram Gopal Varma shocking comments on National Anthem in theatres