శ్రీదేవి పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌... ఇప్పుడైతే బట్టలు లేకుండా....

Ram Gopal Varma Shocking Comments On Sridevi

11:58 AM ON 29th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Shocking Comments On Sridevi

ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. ఈ డైరెక్టర్‌ తాజాగా విజయవాడ రాజకీయనేత వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా 'వంగవీటి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వర్మ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వర్మ మొన్న శుక్రవారం విజయవాడలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వర్మకి ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ఘనంగా స్వాగతం కూడా పలికారు. ఈ నేపధ్యంలో కొంత మంది రాజకీయ నాయకుల్ని కలిసి తనకి కావల్సిన విషయాలు రాబట్టుకున్నాడు. ఆ పనులు పూర్తయిపోయాక వర్మ విజయవాడలోని ఒక కళాశాలలోకి స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్‌ జరపడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ ఒక విద్యార్ధిని వర్మని ఒక ప్రశ్న అడగగా వర్మ తలతిక్క సమాధానం చెప్పాడు. అసలు విషయంలోకి వెళ్తే వెంకటేష్‌-శ్రీదేవి కలిసి నటించిన 'క్షణం-క్షణం' సినిమాలో శ్రీదేవి దుస్తుల కోసం 3 లక్షలు ఖర్చు చేశారటగా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దుస్తులుకి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించగా వర్మ ఎటువంటి మొహమాటం లేకుండా దుస్తులు విప్పితే ఇంకా ఖర్చవుతుందని తల తిక్కగా బదులిచ్చాడు. విద్యార్ధులుతో వర్మ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్‌ కాదని పలువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary