మాలో బెస్ట్ సింగరెవరంటున్న వర్మ (వీడియో)

Ram Gopal Varma Sings Song For Vangaveeti Movie

11:06 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Sings Song For Vangaveeti Movie

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పూడూ వార్తలకెక్కే క్రియేటీవ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగులో తాజాగా తెరకెక్కిస్తున్న వంగవీటి సినిమాలో చంపరా అనే భజన పాట పెట్టారు. ఈ పాటను వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఇక ఈ పాట పాడింది కూడా వర్మనే. ఇక ఛాన్స్ దొరికితే సెలబ్రెటీలపై ఏదో ఒక కామెంట్ చేసే వర్మ ఈ పాటతో పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేశాడు.

శుక్రవారం పవన్ కళ్యాణ్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. సభలో ప్రసంగిస్తూ మధ్యలో పవన్ ఓ పాట పాడాడు. దాన్ని వర్మ ప్రస్తావిస్తూ, పవన్ సభలో పాడిన పాట బాగుందా.. లేక నేను వంగవీటి చిత్రంలో పాడిన చంపరా పాట బాగుందా. మహేశ్ బాబు, ఎన్టీఆర్ , ప్రభాస్ , పవన్ కల్యాణ్ అభిమానుల్లారా.. మా ఇద్దరిలో ఎవరి పాట బాగుందో మీరే చెప్పండి. మా ఇద్దరి పాటల గురించి మ్యూజిక్ డైరక్టర్లు దేవీశ్రీ ప్రసాద్ , ఎస్ ఎస్ థమన్ లను అడగాల్సిందిగా మీడియాను కోరుతున్నా. అంటూ వర్మ ట్వీట్ల ద్వారా పవన్ కల్యాణ్ పై కామెంట్స్ విసిరాడు.

English summary

Sensational and Controversial Director Ram Gopal Varma made some comments on Power Star Pawan Kalyan. Ram Gopal Varama released a song from his latest project Vangaveeti and he sanged a song in that movie. He says that he was better that Pawan Kalyan and he also questions that who was better singer whether he or Pawan Kalyan.