వంగవీటితో సినిమాలు ఆపేస్తా

Ram Gopal Varma To Stop Making Movies

05:04 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma To Stop Making Movies

టాలీవుడ్ లో ‘శివ’ సినిమాతో ట్రెండ్ మార్చేసిన సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇక కొత్తగా తీయబోయే 'వంగవీటి' సినిమా తో ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ప్రకటించాడు. అసలు వంగవీటి రంగా సినిమా ప్రకటించి, వివాదాస్పదం అయ్యాడు. రంగా కొడుకు రాధా అభిమానుల తరపున హెచ్చరిక ఇవ్వడం, దానికి వర్మ కౌంటర్ ఇవ్వడం తెల్సిందే. ఇక ఇప్పుడు వంగవీటి తో స్వస్తి చెప్పడానికి నిర్ణయం తీసుకున్న వర్మ ,నా జీవితంలో వంగవీటి లాంటి కధ దొరకడం గొప్ప విషయంగా చెబుతున్నాడు.

శివ సినిమాతో మొదలైన సినీ ప్రస్తానం వంగవీటి తో ముగుస్తుందని చెప్పిన వర్మ , ఈ సినిమాలో వంగవీటి రాధా , రంగా , రత్నకుమారి , సిరీస్ రాజు , ఎన్టిఆర్ , డాక్టర్ దాసరి , ముద్రగడ, దేవినేని నెహ్రూ పాత్రలు ఉంటాయని ప్రకటించాడు.

శివ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చినా, తన కెరీర్ ని తనదైన శైల్లో మలచుకున్నాడు. వర్మ ఒక స్టేజ్ లో తెలుగు నుంచి వెళ్ళిపోయి హిందీలో స్థిరపడి అక్కడ కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. వర్మ స్కూల్ అని చెప్పుకునేలా ఎందరినో తీర్చి దిద్దాడు. ఇక గత కొద్ది సంవత్సరాలుగా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మ సక్సెస్ అనేదానికి చాలా దూరంగా ఉన్నాడు, కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

రియల్ లైఫ్ స్టోరీస్ ని ఇష్టపడే వర్మ రీసెంట్ గా వంగవీటి రాధా జీవిత ఆధారంగా ‘వంగవీటి’ అనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా, ఈ సినిమా చేయద్దు ఆపేయమని తనకి చాలా మంది నుంచి వార్నింగ్ కూడా వచ్చినా, ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయిన వర్మ ఇప్పుడు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. వంగవీటి సినిమా తర్వాత ఇక నేను తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించను అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అయితే, వర్మ ఇలా చెప్పడం ఇది మొదటిసారేం కాదు. గోవింద గోవింద టైములో కూడా అలా చెప్పే బాలీవుడ్ కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడెందుకో తెలుగు సినిమాలకి స్వస్తి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇక వర్మ చేస్తున్న వంగవీటి కాకుండా ‘పట్ట పగలు’, ‘ఎటాక్’, ‘శ్రీదేవి’, ‘మొగలి పువ్వు’ లాంటి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం సహజంగానే సంచలనానికి దారితీసింది.

English summary

We all Know Contreversial Director Ram Gopal Varma was going to make movie on Vangaveeti Mohana Ranga. Today in an TV interview Ram Gopal Varma said that he was going to stop doing movies after This Movie.