ఈసారి మహేష్ ని ఏకిపారేశాడు

Ram Gopal Varma Tweets On Brahmotsavam Movie

10:10 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Tweets On Brahmotsavam Movie

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, తరచూ వార్తలకెక్కె సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వరుసపెట్టి బాణాలు వదిలాడు. ఇక ఈసారి సూపర్‌స్టార్ మహేష్ బాబును టార్గెట్ చేశాడు. అది కూడా డొంక తిరుగుడు వ్యవహారం గా దుమ్మెత్తి పోసాడు. స్ట్రైట్‌గా ‘బ్రహ్మోత్సవం’, మహేష్ బాబు పేర్లను వాడకుండా ఆచితూచి చురకలు అంటించాడు. మిస్టర్ ఎమ్ స్టార్‌డమ్ గురించి తెలుసుకోవాలని వర్మ కోరాడు. ఇక ఫ్యామిలీ సినిమాల నిర్మాణం ఆగిపోవాలని, బ్రహ్మదేవుని ముఖాన్ని చూడాలని ఉందని ట్వీట్ చేశాడు. ఇక భిన్నమైన కథ, కథనంతో కూడిన సినిమాలు రావాలని ఆకాంక్షించాడు. ఫ్యామిలీ సినిమాలు థియేటర్లలోని ఎంట్రీ, ఎగ్జిట్ విజువల్స్ మాత్రమే.. కానీ ఆడియెన్స్ ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్‌మన్’ లాంటి చిత్రాలు చూడడానికి ఇష్టపడతారు అన్నాడు. గతంలో నేను చూసిన ‘దేవత’ సినిమా స్టోరీ సూపర్.. కానీ హీరో శోభన్ బాబు గుర్తు లేడు. ‘ఏజంట్ గోపీ’, ‘అడవిరాముడు’ మూవీల్లో కృష్ణ, ఎన్టీఆర్‌లు గుర్తున్నా ఆ సినిమాల కథలు గుర్తు లేవు.. అంటూ సినిమాలంటే అలాంటివని, కథలంటే అవేనని పరోక్షంగా వర్మ ప్రస్తావించాడు.

ఇవి కూడా చదవండి:నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదంటున్న హీరోయిన్

ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమాకు వెళ్తే.. తండ్రి హీరోయిన్ అందాన్ని చూస్తాడు.. తల్లి వాళ్ళ డ్రెస్ చూస్తుంది. కూతురు బాయ్‌ఫ్రెండుతో ముచ్చట్లు పెడుతుంది. బోర్ కొట్టిన కొడుకు నిద్రపోతాడు. శోభన్ బాబు లాంటి స్టార్లు మాత్రమే కుటుంబ సినిమాలు చేస్తారని ఇన్‌డైరెక్ట్‌గా అన్నాడు. అంతర్జాతీయ కొరియోగ్రాఫర్లు సేవియస్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వాళ్ళు ఈ డ్యాన్స్ చూసి నేర్చుకోవాలంటూ బ్రహ్మోత్సవంలోని ఓ డ్యాన్స్‌ను వర్మ గుర్తు చేశాడు. అయితే తన కామెంట్స్‌ని మహేష్ ఫ్యాన్స్ పాజిటివ్‌గా తీసుకోవాలని కోరుతూ ముక్తాయింపు ఇచ్చాడు. . మొత్తం మీద ‘బ్రహ్మోత్సవం’ మూవీ మీద వర్మ ఇలా సెటైర్లు పేల్చి తన కసి తీర్చుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు

ఇవి కూడా చదవండి:హీరోలకు మళ్ళి లైఫ్ ఇచ్చిన సినిమాలు

English summary

Controversial Director Ram Gopal Varma commented on Super Star Mahesh Babu's recent flick was "Brahmotsavam" he made some comments that "The main utsavam for me is that family films will stop getting made and I want to now see Brahma devudu's face" . He also commented mahesh babu's dance in Brahmotsavam movie.