శివమార్కు వంగవీటి లోగో

Ram Gopal Varma Vangaveeti Movie Logo Launch

09:50 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Vangaveeti Movie Logo Launch

ఎన్ని బెదిరింపులోచ్చినా లెక్కచేయకుండా తాను అనుకున్నది చేయడంలో, రామ్ గోపాల్ తర్వాతే ఎవరైనా... అందుకే తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. తాజాగా వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ లోగోను వర్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా గురువారం విడుదల చేశారు. ఎర్రటి జెండా, కత్తి, వంగవీటి అనే అక్షరాన్ని గొలుసులతో కట్టివేయడం ఈ లోగోలో కనిపిస్తోంది. ఈ చిత్రమే తన చివరి తెలుగు సినిమాగా గతంలో ప్రకటించిన వర్మ ఈ తాజా చిత్రం వంగవీటి గురించి కూడా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన దగ్గర నుంచీ, బెదిరింపు ప్రకటనలు, వర్మ కౌంటర్ .. ఇలా సంచలనం రాజ్యమేలుతోంది.

English summary

Controversial Director ram Gopal Varma launched new poster of Vangaveeti movie in Twitter.This movie was directing by based on the Politician and Leader Vangaveeti Mohana Ranga.