ఆ డైరెక్టర్ ని లిప్ లాక్ అడిగిన వర్మ.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Ram Gopal Varma want liplock with director

01:08 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma want liplock with director

ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. రామ్ గోపాల్ వర్మ ఓ డైరెక్టర్ తో లిప్ లాక్ పెట్టుకోవాలని ఆశపడ్డాడు. అలాగని ఆ డైరెక్టర్ లేడీ అయి ఉంటుందనుకుంటే పొరపాటే. ఓ మగ దర్శకుడితోనే ఆయన లిప్ లాక్ చెయ్యాలని కోరుకున్నాడు. ఇలా చేస్తున్నా కాబట్టి తానేమీ గే కాదని.. అవతలి వ్యక్తి కూడా గే కాదని అన్నాడు వర్మ. ఇంతకీ వర్మ లిప్ లాక్ చేయాలనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా.. ఒకప్పుడు వర్మ దగ్గర రచయితగా పని చేసి.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాతగా ఎదిగిన అనురాగ్ కశ్యప్.

తన నిర్మాణంలో వచ్చిన ఉడ్తా పంజాబ్ సినిమాను ఇబ్బంది పెడుతున్న సెన్సార్ బోర్డు పై ఆయన పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ వివాదం పై బాంబే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సెన్సార్ బోర్డుకు చురకలంటిస్తూ.. సినిమా విడుదలకు మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో వర్మ సంతోషం పట్టలేక అనురాగ్ కశ్యప్ తో లిప్ లాక్ చేయాలని ఆశపడ్డాడు. నేను.. మీరు... గేలు కానప్పటికీ సెన్సార్ బోర్డు మీద మీరు చేసిన పోరాటానికి అబ్బుర పడి.. మీ నోట్లో నోరు పెట్టి ముద్దాడాలని ఉంది అని ట్వీట్ చేశాడు వర్మ. అయితే వర్మ ట్వీట్ ను కశ్యప్ కనీసం పట్టించుకుని రిప్లై కూడా ఇవ్వలేదు.

కశ్యప్ కంటే ముందు నుంచి సెన్సార్ బోర్డు మీద వర్మ పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఆయన సినిమాలు చాలా వాటికి సెన్సార్ వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ మధ్య సెన్సార్ బోర్డు తీరు మరీ శ్రుతి మించి పోతుండటంతో వర్మ వాళ్ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఉడ్తా పంజాబ్ విషయంలో అయితే సెన్సార్ వాళ్ల గాలి బాగానే తీశాడు వర్మ. ఉడ్తా పంజాబ్ సెన్సార్ బోర్డు పై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ పెద్ద పార్టీ చేయాలని.. దానికి బాలీవుడ్ బడా బాబులందరూ రావాలని.. అలా రాని వారిని వెన్నుపోటుదారులుగా భావించాలని వర్మ వ్యాఖ్యానించాడు.

English summary

Ram Gopal Varma want liplock with director