నయీమ్ జీవితంపై మూడు భాగాల సినిమా!

Ram Gopal Varma want to take Nayim story in 3 parts

01:15 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma want to take Nayim story in 3 parts

అవునా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తలకెక్కే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందుకు సిద్ధం అవుతున్నాడు. అసలే క్రైమ్ మూవీస్ అంటే పడిచచ్చే వర్మ, రక్త చరిత్ర రెండు పార్టులుగా తీసాడు. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా 3 సినిమాలు తీయబోతున్నానని ట్వీట్ చేశాడు. సంక్లిష్టమైన నయీం కథను ఒక్క భాగంలో చూపించడం అసాధ్యమని, అందుకే మూడు భాగాలుగా సినిమా తీయబోతున్నానని ట్వీట్ లో చెప్పాడు. నయీం నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ ఫార్మర్ గా ఆపై అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ గా తర్వాత కరుడుగట్టిన నేరగాడిగా మారిన విధానం భయం కలిగించేలా ఉందన్న వర్మ, నయీంకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించానన్నాడు.

ఇన్నేళ్లుగా అతడు చేసిన నేరాలలో వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఘటనలు చాలా ఉన్నాయని వర్మ చెప్పుకొచ్చాడు. కాగా నయీమ్ సాగించిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. వరుసపెట్టి ఒక్కోటి వెలుగులోకి వస్తుంటే, వళ్ళు గగుర్పొడుస్తోంది.

English summary

Ram Gopal Varma want to take Nayim story in 3 parts.