ఫ్యాన్ ని అంటూనే రజనీ గాలి తీసేసిన వర్మ ..

Ram Gopla Varma Comments On Rajinikanth And Amitabh Bachchan

12:20 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Ram Gopla Varma Comments On Rajinikanth And Amitabh Bachchan

మొన్న పవన్ కళ్యాణ్ అయిపోయాడు.. నిన్న మహేష్ బాబు అయిపోయాడు.. అదే పనిగా బన్నీని కూడా ఓ చూపు చూసేశాడు. షారుఖ్ ఖాన్ ను సైతం వదల్లేదు. మధ్యలో రజినీ మీద కూడా ఫోకస్ పెట్టాడు. బిగ్-బి అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా తీన్ చూసి మెస్మరైజ్ అయిపోయిన వర్మ.. అమితాబ్ ను ఆకాశానికెత్తేస్తూ.. పనిలో పనిగా రజినీకాంత్ గాలి తీస్తూ.. తన మీద తాను కూడా సెటైర్ వేసుకున్నాడు.

అమితాబ్ బచ్చన్ అవసరమైతే మాస్ హీరోయిజమూ పండించగలడట. అలాగే ప్రయోగాత్మక చిత్రాల్లోనూ చించేస్తాడట. కానీ రజినీకాంత్ కానీ మరొకరు కానీ ఇలా చేయలేరని వర్మ అంటున్నాడు . తీన్ సినిమాలో రజినీకంత్ నటించి ఉంటే 1 మార్కు పడేదని.. అదే అమితాబ్ కబాలి చేస్తే 100 మార్కులు పడతాయని సెలవిచ్చాడు. తాను రజినీకాంత్ కు పెద్ద ఫ్యాన్ అంటూనే అమితాబ్ బచ్చన్ రోబో లో నటించి ఉంటే ఇంకా చాలా చాలా బెటర్ గా సినిమా ఆడేదని.. కానీ రజినీకాంత్ తీన్ సినిమా చేస్తే తుస్సుమనేదని అనేసాడు.

తీన్.. బ్లాక్.. పీకూ లాంటి సినిమాల్లో రజినీకాంత్ చేస్తే పెద్ద జోక్స్ అయ్యేవని.. ఈ విషయంలో రజినీకాంత్ కూడా తన అభిప్రాయాన్ని అంగీకరిస్తాడని వర్మ అంటున్నాడు. తన అభిప్రాయం మీద రజినీకాంత్ ఆన్సర్ చెప్పాలని కూడా వర్మ డిమాండ్ చేశాడు. భారతీయ సినిమాను ముందుక తీసుకెళ్లడం కోసం అమితాబ్ తన స్టార్ డమ్ వదులుకుని ప్రయోగాలు చేశాడని వర్మ చెప్పుకొచ్చాడు. తెలుగులో చిరంజీవి.. తమిళంలో రజినీకాంత్ లాంటి వాళ్లు అమితాబ్ ను చూసి నేర్చుకుని మాస్ హీరోలుగా ఎదిగారని.. కానీ అమితాబ్ మాత్రం తన పవర్ ఏంటో తాను తెలుసుకోలేకపోయాడని వర్మ సెలవిచ్చాడు. హీరోయిజం లేని రణ్ లాంటి సినిమాలు చేయడం అమితాబ్ చేసిన తప్పని వర్మ అన్నాడు. ఆ రణ్ సినిమా వర్మ దర్శకత్వం వహించిందే కావడం విశేషం. అదండీ వర్మ తాజా వివాదం.

English summary

Controversial Director Ram Gopal Varma Fires made some comments on Big B Amitabh Bachchan and Super Star Rajinikanth. He compared Rajinikanth with Amitabh Bachchan.