తనను కాదందని చంపేశాడు

Ram Kumar says She insulted my looks in public

12:05 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Ram Kumar says She insulted my looks in public

చెన్నైలోని నుంగం బాక్కం రైల్వే స్టేషన్ లో ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని దారుణంగా హత్య చేసిన రాంకుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చాలా విషయాలు చెప్పాడు. తనను స్వాతి చీదరించుకున్న కారణంగానే ఆమెను హతమార్చానన్నాడు. తను స్వాతిని గాఢంగా ప్రేమించానని, కానీ ఆమె తన ప్రేమను తిరస్కరించిందని అన్నాడు. తిరునల్వేలిలోని ఐన్ స్టీన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన రాంకుమార్.. తను అబద్ధాలు చెప్పి ఆమెకు మొదట చేరువైనట్టు చెప్పాడు.

‘నేను మెకానికల్ ఇంజనీరుని, నెలకు లక్ష రూపాయల జీతం వస్తుందని చెప్పి నమ్మబలికా.. అయితే ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నానన్న విషయం తెలుసుకుని స్వాతి నన్ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఇది భరించలేకపోయా.. నాకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని భావించి ఆమెను అంతమొందించా’ అని రాంకుమార్ చెప్పాడు. తిరునల్వేలిలో పోలీసులను చూడగానే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈ కిరాతకుడిని విచారణ కోసం తిరునల్వేలి నుంచి పోలీసులు త్వరలో చెన్నైకి తీసుకురానున్నారు.

ఇది కూడా చూడండి: పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

ఇది కూడా చూడండి: సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

ఇది కూడా చూడండి: బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా

English summary

Ram Kumar says Swathi insulted my looks in public.