నేను మహామంత్రిని ... ఇక  మంత్రి పదవి ఎందుకు?

Ram Madhav On Minister Post

06:13 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Ram Madhav On Minister Post

బీజేపీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి మాత్రమే కాదు ప్రధానమంత్రి నరేంద్రమోడీ టీంలో కీలక సభ్యుడు అయిన రామ్మాధవ్.. కాశ్మీర్ వంటి సంక్లిష్ట రాష్ట్రంలో బీజేపీని అధికారపీఠంపై కూర్చోబెట్టిన వ్యూహకర్త. అసోంలో విజయం సాధించడంలో ప్రముఖ పాత్రం కూడా ఆయనిదే. మరి ఇలా బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో ముందున్న రామ్ మాదవ్, అసోంలో పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టిన నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసోం ఎన్నికల్లో విజయానికి ఎంతోమంది కృషి ఉందని ఎన్నో అంశాలు అక్కడ బలంగా పని చేశాయని చెప్పారు. ఈ ఫలితాలకు సూత్రదారిగా ఉన్న తను కేంద్ర కేబినెట్ లో చేరనున్నట్టు వస్తున్న వార్తలను కూడా రామ్ మాధవ్ ఖండించారు. నేను మంత్రిగా కాదు - మహా మంత్రి (ప్రధాన కార్యదర్శి)గా ఉంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని చమత్కరించారు. 2019 ఎన్నికల్లో మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేలా పార్టీని సిద్ధం చేస్తామని చెప్పారు. కేరళ నుంచి బెంగాల్ వరకు కోరమండల్ తీరంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత రెండేళ్లలో మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎంతో చేసిందన్నారు. ఆ ఫలాలే ఇప్పుడు ప్రజలకు చేరుతున్నాయని రాబోయే రోజుల్లో మరిన్ని ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు.

ఇవి కూడా చదవండి:జరిగే శోభనాన్ని ఆపిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

ప్రతి రాష్ట్రంలో కుల రాజకీయాలు ఉంటాయి కానీ మోదీ ప్రభుత్వం మంచి పనుల ద్వారా బిజెపిని పటిష్టం చేస్తామన్నారు. మత అసహనం ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని మోడీని అపఖ్యాతిపాలు చేసేందుకు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. రెండేళ్ల రిపోర్ట్ కార్డును ఈనెల 26న శహరాన్పూర్ ర్యాలీలో మోడీ ప్రజల ముందు పెడతారని రామ్మాధవ్ చెప్పారు. బిజెపి మంత్రులు - నాయకులు - ఇతర ప్రముఖులు 27నుంచి తమ ప్రాంతాలకు వెళ్లి రిపోర్టు కార్డు వివరాలను ప్రజలకు వివరిస్తారన్నారు.

ఇవి కూడా చదవండి:ఎస్.జె. సూర్య సినిమాలో పవన్ న్యూ గెటప్ ఇదేనా?!

ఇవి కూడా చదవండి:13 మంది భార్యలను ఒకేసారి గర్భవతులను చేసిన భర్త

English summary

BJP leader Ram Madhav played a lead role in winning BJP in Jammu And Kashmir and Assam Elections. He said that he dont want minister position. His goal is to win BJP in 2019.