బోణి కపూర్‌ పై విరుచుకు పడిన రామ్‌గోపాల్‌ వర్మ

Rama Gopal Varma Responds To Boni Kapoor Comments

04:06 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Rama Gopal Varma Responds To Boni Kapoor Comments

ఇటీవల వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నటి శ్రీదేవి పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . వర్మ తన ఆత్మకధలో శ్రీదేవి పై చేసిన వ్యాఖ్యలను బోణికపూర్‌ ఖండించాడు.

బోణికపూర్‌ స్పందిస్తూ రామ్‌గోపాల్‌వర్మ వెర్రివాడని,వెర్రిచేష్టలు చేస్తాడని అన్నాడు . బోణికపూర్‌ వ్యాఖ్యలకు స్పందించిన వర్మ తన ఆరాధ్య కధానాయిక శ్రీదేవి అని, శ్రీదేవిని ఆమె భర్త కంటే తానే ఎక్కువగా గౌరవిస్తానని అన్నాడు. ఆ విషయం శ్రీదేవి మనసుకు కూడా తెలుసునని అన్నారు. బోణికపూర్‌ తన పై విషం కక్కే ముందు తాను అసలు ఏం రాశానో పుస్తకంలో చదవాలని వర్మ ట్విట్టర్లో ట్వీట్‌ చేసాడు. శ్రీదేవి గారిని, ఆమె నటనను, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె ప్రేమించిన బోణికపూర్‌ను తాను ఎప్పుడు గౌరవిస్తుంటానని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

English summary

Director Ram Gopal Varma responds to boni kapoors statements . Ramgopal vaarma says that he respect actress sridevi because she was the favourite actor of him and he says boni kapoor to read carefully what i written and then respond on that words