రంభ! రీ ఎంట్రీ ...

Rambha To Give Reentry into films

10:59 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Rambha To Give Reentry into films

అవును రంభ.. అలనాటి గ్లామర్ బ్యూటీ... ఇప్పడు వెండితెరపై రీ ఎంట్రీ రెడీ అయిందా? అంటే ఫిల్మ్ నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వచ్చిన రంభ ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. బావాగారూ బాగున్నారా అంటూ వచ్చిన రంభ, చిరు మధ్య సినిమా విషయాలు చర్చకు వచ్చినట్టు అంటున్నారు. తనకు ఇండస్ర్టీకి రావాలని వుందంటూ మనసులోని మాటను చిరుకి చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా కలిసారో లేదో అప్పుడే దీనిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదంతా చూస్తుంటే, రంభ మళ్లీ వెండితెరపైకి రావడం ఖాయమని అంటున్నారు. నిజానికి చిరంజీవి అభిమానుల్లో రంభ కూడా వుంది. ఇక చిరు సినిమాల్లోనూ నటించింది కూడా! మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరమైన ఈ నటి, మెగా హీరోల సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి అలనాటి బ్యూటీలు ఒకొక్కరుగా ఇండస్ర్టీలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు.

ఇవి కూడా చదవండి:రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

ఇవి కూడా చదవండి:చిరు మదర్ అండ్ ఫాదర్ ఎవరో తేల్చేశారు!

English summary

Veteran Heroine Rambha recently met Megastar Chiranjeevi family with her family and according to the sources Rambha wanted to give her re-entry into films.