రైనా పాత్రలో రామ్‌చరణ్‌  

Ramcharan To Act As Raina In Dhoni Movie

06:18 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Ramcharan To Act As Raina In Dhoni Movie

భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని జీవిత కథ ఆధారంగా తెరక్కెకుతున్న చిత్రం '' ఎంయస్‌ ధోని - ది అన్‌టోల్ట్‌ స్టోరి' . ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే తెరక్కెకిస్తున్నాడు. ఈ సినిమాలో ధోని పాత్రలో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నాడు. అయితే ఇటీవల క్రికెటర్‌ ధోని ఈ సినిమా సెట్‌ను సందర్శించాడు.

ఈ విషయాన్ని ధోని తండ్రి పాత్రలో నటిస్తున్న అనుపమ్‌ ఖేర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ధోని సినిమా సెట్‌లోకి క్రికెటర్‌ ధోని రావడం తో ధోని సినిమా యూనిట్‌ మొత్తం చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు.

ఇక పోతే భారత క్రికెట్లో ధోని, రైనాల ఎంత మంచి స్నేహితులో వేరే చెప్పనక్కర్లేదు. ఆ ధోని సినిమాలోని రైనా పాత్రలో టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ నటించబోతున్నాడు. రైనా పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తుండగా, ధోని భార్య సాక్షి పాత్రలో కైరా ఆద్వాని నటిస్తుంది. అంతేకాక భూమిక, జాన్‌అబ్రహాం, అర్జున్‌కపూర్‌ వంటి నటుల ముఖ్య పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా పై అటు క్రికెట్‌ అభిమానుల్లోను, ఇటు సినీ అభిమానుల్లోను అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


English summary

Mega Power star ram charan to act as raina in Dhoni movie which was directing by director neeraj pandey