వర్మ వెర్సెస్ శివాజీ

RamGopal Varma Fires On Sivaji

01:18 PM ON 12th February, 2016 By Mirchi Vilas

RamGopal Varma Fires On Sivaji

“వంగవీటి” సినిమాపై తన అభిప్రాయాలు తెలిపేందుకు టీవీ 9 ఛానల్ లైవ్ షోలో దర్శకులు వర్మ పాల్గొని విషయాలు చెబుతుంటే, వర్ధమాన నటుడు శివాజీ ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్యా ఆసక్తికరంగా మాటల యుద్ధం నడించింది. “ఒక సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఇలాంటి కుల వివక్షను ప్రదర్శించే సినిమాలు తీయద్దు. మీ క్రియేటివిటికి ఇంతకు మించిన కధలు చాలా దొరుకుతాయి' అని శివాజీ అంటూ, అయితే ఇది కేవలం తన సూచన మాత్రమేనని చెప్పుకొచ్చాడు.

అనాల్సింది అనేసి సూచనంటే, వర్మకు ఆ మాత్రం అర్ధం కాదా ఏమిటి? అందుకే గా వర్మ కొంచెం కఠువుగా స్పందించాడు. “ఏదో 5వ తరగతి పిల్ల వాడికి క్లాస్ పీకినట్లు తనకు చెప్పవద్దని, ఇవన్నీ తనకు తెలిసినవేనని” అంటూ వర్మ ఇచ్చిన సమాధానానికి, శివాజీ మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. “మీకు క్లాస్ పీకే స్థాయి తనది కాదు. అయినా అయిదవ తరగతి పిల్లాడ్ని కొట్టి చెప్తామని, ఇలా చెప్పమని, మీరు యూట్యూబ్ లో సినిమాలు రిలీజ్ చేస్తే చూడాలి, మీరు ఏది చెప్తే అది మేం వినాలి, కానీ మేం ఏది చెప్పినా మీరు వినరా? అయినా ఇప్పటికీ ఆత్యాచారం జరిగిన అమ్మాయి మీద మళ్ళీ బలాత్కారం చేస్తే ఎలా ఉంటుందో… ప్రస్తుతం వర్మ చేసే సినిమా కూడా అలాంటిదే. ఇప్పటికే కుల రాజకీయాలతో ఏపీ అట్టుడుకుతుంటే, ఇలాంటి సినిమాలు తీయడం సబబు కాదు" అంటూ తన అభిప్రాయాన్ని శివాజీ కొంచెం ఘాటు గా చెప్పాడు.

ఇదిలా వుంటే, ఈ సినిమా విడుదల తేదీ పై యాంకర్ అడిగిన ప్రశ్నకు… “ఎప్పుడు పూర్తయితే అప్పుడు విడుదల అవుతుంది, ఎప్పుడు పూర్తవ్వాలో అప్పుడే పూర్తవుతుంది” అంటూ వర్మ తనదైన శైలిలో బదులు ఇచ్చాడు. 'మీకు నచ్చినా లేకున్నా నేను తీయకుండా ఉండను, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు' అంటూ వర్మ చెప్పడం ఎన్నిసార్లు మనం చూడలేదూ , వినలేదూ అంటూ పలువురు వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలు ఈ సినిమా ప్రారంభానికి ముందే ఇంత రాద్ధాంతం జరుగుతుంటే , ఇక పూర్తయి విడుదలైతే ఎలా వుంటుందో కదా. ఏది ఏమైనా ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం లో వర్మ స్టైలే వేరబ్బా.

English summary

Contreversial Director Ram Gopal Varma Serious On Hero Sivaji In Live TV Show.Sivaji says that Ram Gopal Varma not make controversial movies on any caste.Ram Gopal Varma gives counter to Sivaji and says that he not to talk like a kid.