తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావుపై వేటు పడింది

Rammohan Rao Removed as Tamil Nadu Chief Secretary

05:33 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

Rammohan Rao Removed as Tamil Nadu Chief Secretary

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1981ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం భూపరిపాలన విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో విశేష అనుభవం ఉన్న గిరిజ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ కుమార్తె. భర్త రాజా వైద్యనాథన్ స్పిక్ గ్రూప్‌నకు చెందిన ఫోర్‌సైట్ ఫైనాన్షియల్‌లో పనిచేస్తున్నారు. వివిధ శాఖల్లో 15 ఏళ్ల అనుభవం ఉన్న గిరిజా వైద్యనాథన్ చెన్నై ఐఐటీ నుంచి హెల్త్ ఎకనమిక్స్‌లో డాక్టరేట్ పొందారు.

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్రావు నివాసం, కార్యాలయంపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నల్లకుబేరుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలున్నాయని.. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డికి ఆయన భారీస్థాయిలో బంగారం కొనుగోలు చేసేందుకు సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంతో పాటు, కుమారుడు, బంధువుల ఇళ్లల్లో మూడు రాష్ట్రాల్లోని 13 చోట్ల ఏకకాలంతో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీయెత్తున నగదు, బంగారం బయటపడినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సోదాలపై తమిళనాడులోని విపక్షాలన్నీ ఏకమై విమర్శలు గుప్పించాయి. రామ్మోహన్‌రావును తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఐటీ సోదాలు జరగడం రాష్ట్ర చరిత్రలో తొలిసారని.. ఈ చర్యతో రాష్ట్రం పరువు పోయిందని డీఎంకే నేత స్టాలిన్ సహా విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ పరిణామాలను మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామ్మోహన్‌రావుపై వేటు వేయడమే మంచిదని భావించి ప్రభుత్వం ఆయన్ని తొలగించినట్లు చెబుతున్నారు. ఇంకా ఎంతమంది బయట పడతారో చూడాలి.

ఇది కూడా చూడండి: కొత్త నోట్ల.. ప్రింటింగ్ ఖర్చెంతో తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చూడండి: షాకింగ్ న్యూస్ : జయ వారసురాలు ఈమెనట

ఇది కూడా చూడండి: కరుణానిధి పరిస్థితి ఇదీ

English summary

Rammohan Rao Removed as Tamil Nadu Chief Secretary.