మీడియా మొఘల్ రామోజీయే

Ramojirao is as movie Moghal

01:32 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Ramojirao is as movie Moghal

అవును, పక్కా ప్రణాళిక ఈనాడు సొంతం... ఎన్ని పత్రికలు వచ్చినా తెలుగులో ఈనాడు స్థానం సుస్థిరం.. ఈ విషయం మరోసారి తేటతెల్లం అయింది. తెలుగులో ఈనాడు దినపత్రిక తన స్టామినా మరోసారి చూపించింది. ఈనాడు అధిపతి రామోజీరావు మరోసారి మీడియా మొఘల్ తానేనని నిరూపించుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఏబీసీ వెల్లడించే గణాంకాల ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఈనాడు ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది. దేశం మొత్తం మీద ప్రతి రోజు డైలీ పేపర్ల సర్క్యులేషన్ సంఖ్య 7 కోట్లుగా ఉంది. ఈ ఏడు కోట్లలో తెలుగు పత్రికల సర్క్యులేషన్ వాటా దాదాపు 40 లక్షలు.

తెలుగులోని అన్ని డెయిలీలు పేపర్ల సర్కులేషన్ 40 లక్షలు ఉంది. వీటిలో ఈనాడు ఏ పేపర్కు అందనంత ఎత్తులో 18 లక్షల సర్క్యులేషన్ తో ఉంది. ఇక రెండో స్థానంలో వైకాపా అధినేత జగన్కు చెందిన సాక్షి పత్రిక ఉంది. సాక్షి ఈనాడుకు చాలా దూరంలో 11.50 సర్కులేషన్ కలిగి ఉంది. తెలుగులో టోటల్ గా అన్ని పేపర్ల సర్క్యులేషన్ల సంఖ్య 40 లక్షలు ఉంటే ఈనాడు, సాక్షి కలిపే 30 లక్షల సర్య్కులేషన్ కలిగి వుండడం విశేషం. తెలుగులోని నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన పత్రికలు అన్నీ కలిసి పదిలక్షల స్థాయిలో అమ్ముడవుతున్నాయి.

దీంతో తెలుగు మీడియా రంగంలో మరోసారి రామోజీ తన సత్తా చాటారు. ఇక దేశంలో అత్యధిక సర్క్యులేషన్ తో దైనిక్ భాస్కర్ పత్రిక నిలిచింది. ఈ పేపర్ ప్రతి రోజూ దాదాపు 38 లక్షల ప్రతులను అమ్ముతోంది. ఆ తర్వాత స్థానంలో దైనిక్ జాగరణ్ ఉంది. మొత్తం మీద మూడో స్థానంలో, ఇంగ్లీష్ డెయిలీల్లో తొలి స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ పత్రిక సర్క్యులేషన్ దాదాపు 30 లక్షలుగా లెక్క తేలింది. తెలుగులో మాత్రం దటీజ్ ఈనాడు అంటున్నారు.

English summary

Ramojirao is as movie Moghal