'నేను- శైలజ' లో మరో ట్విస్ట్‌..!

Rams New Movie Updates

06:30 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Rams New Movie Updates

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటిస్తున్న చిత్రం "నేను - శైలజ" కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఫ్రెష్‌లుక్‌లో కనిపిస్తున్న రామ్‌ ఈ చిత్రం పైనే ఆశలు పెటుకున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రోజుకో విషయం బయటకొస్తుంది. ఈ చిత్రం లో హీరోయిన్‌గా మలయాళ కుట్టి కీర్తి సురేష్‌ నటిస్తుండడంతో పాటు హీరోయిన్‌కి అన్నగా 'బస్‌స్టాప్‌' ఫేమ్‌ ప్రిన్స్‌ నటిస్తున్నాడని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తుందన్న విషయం బయటకొచ్చింది. నేను -శైలజలో ఒక కీలకమైన పాత్ర లో కోల్‌కత్తా సందరి లౌన్యాప్‌ కూడా నటిస్తుంది. తాన్యా మిస్‌ ఇండియా 2015 కాంటెస్ట్‌లో కూడా పాల్గొంది అయితే దురదృష్టవశాత్తు టాప్‌ 5 లో నిలవలేకపోయింది. కానీ తన లుక్స్‌తో అదరగొట్టింది. ఆ లుక్స్‌ వల్లే నేను-శైలజలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఈ కోల్‌కత్తా సుందరి ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. తాన్యా తో పాటు నేను- శైలజ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా ఈ చిత్రం పైనే బోలేడన్ని ఆశలు పెట్టుకుంది. జనవరి 1 న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్‌ పతాకం స్రవంతి రవి కిషోర్‌ నిర్మిస్తున్నారు.

English summary

Another twist in rams new movie nenu -sailaja another heroine lounyap to act in this movie