టీనేజ్ కుర్రాడితో ఎఫైర్‌ పెట్టుకున్న రమ్యకృష్ణ

Ramya Krishna affair with teenage boy

12:12 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Ramya Krishna affair with teenage boy

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన రమ్యకృష్ణ ఆ తరువాత డైరెక్టర్‌ కృష్ణవంశీని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆ తరువాత రమ్య సినిమాల్లో నటించదు అని అనుకున్నారంతా...కానీ మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది రమ్య. తల్లి, అత్త పాత్రల్లో ఆడపాదడపా కనిపిస్తూ అలరించింది. అయితే క్రిందటి సంవత్సరం 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రలో నటించి ఆ పాత్రకే ప్రాణం పోసింది. ఈ చిత్రం రమ్యకృష్ణ కెరీర్‌కే ఊపందుకునేలా చేసింది. ఆ తరువాత 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నాగార్జున సరసన నటించి సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ రెండు చిత్రాలు రమ్యకృష్ణ కెరీర్‌నే మార్చేశాయి.

ఆ రెండు చిత్రాలు తరువాత రమ్యకృష్ణకు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అయితే తాజాగా ఒక హాట్‌ పాత్రలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. అదేంటంటే రమ్యకృష్ణ ఓ మిడిలేజ్‌ ఆంటి పాత్రలో కనిపించనుంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ టీనేజ్‌ కుర్రాడితో ఎఫైర్‌ పెట్టుకున్న పాత్రలో నటిస్తుందని సమాచారం. దీనితో పాటు రమ్యకృష్ణ తమిళంలో టీవి ఛానల్స్‌ లోని సీరియల్స్‌ లో నటిస్తూ బిజీగా ఉంది. మొత్తానికి రమ్యకృష్ణ ఈ వయసులో కూడా తన జోరుని కొనసాగిస్తూ దూసుకుపోతుంది.

English summary

Ramya Krishna affair with teenage boy. Veteran actress Ramya Krishna is acting in affair with teenage boy role.This movie is doing in Malayalam.