రమ్య కృష్ణ కండీషన్ వింటే షాకవ్వాల్సిందే

Ramya Krishna Condition To Do Movies

11:15 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Ramya Krishna Condition To Do Movies

వయస్సులో ఉండగా, తన అందచందాలు ఆరబోస్తూ, యువ హృదయాల్లో గిలిగింతలు పెట్టిన రమ్య కృష్ణ ఇప్పుడు వయస్సు మళ్ళిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ పాత్రలు, అత్త పాత్రల తో అదర గొట్టేస్తోంది. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తరువాత రమ్యకృష్ణ బిజీ ఆర్టిస్టు అయిపోయింది. ఇక రెమ్యూనరేషన్ కూడా బానే ఉంది. అయితే సోగ్గాడే చిన్ని నాయనే సినిమాలో అమ్మ పాత్ర అయినా అమ్మాయి పాత్రను తలదన్నేలా చేసింది. అందరినీ కట్టిపడేసింది. దీంతో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయట. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో చేసిన అమ్మ పాత్రలలో తనను కుర్ర హీరోయిన్లు అమ్మా అని పిలిచినా పట్టించు కోలేదుకానీ, ఇప్పుడు మాత్రం అలా పిలవద్దంటూ కండీషన్ పెడుతోందట! అందుకే సోగ్గాడే చిన్నినాయన లో నాగార్జునకి తల్లిగా చేసినా ఏ సీన్ లో అమ్మా అనిపిలిపించుకోలేదు. సత్యా అంటూ పిలిస్తేనే చేస్తానని కండీషన్ పెట్టిందట! ఆ సినిమాలో అలా మేనేజ్ చేయగలిగారు. బాహుబలి లో కూడా రాజమాతగా పిలిపించుకుందే తప్ప రానా తో గానీ ప్రభాస్ తో గానీ అమ్మా అని పిలిపించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కమల్ సరసన ఆయనకు భార్యగా చేస్తోంది. ఇందులో శ్రుతి కూడా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా అమ్మా అని పిలవకూడదని కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఎక్కడా అమ్మ పదం పలకకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారట యూనిట్. భలే ఉంది కదూ కండీషన్.

ఇవి కూడా చదవండి:సాయిధరమ్ తేజ్ తిక్క కుదిరింది

ఇవి కూడా చదవండి:రానా సోదరుడొస్తున్నాడు ...

English summary

Heroine Ramya Krishna was now started her second innings and she was keeping conditions to do movies that she was putting condition that no body should call her as Mother in the movies. At present she was acting in as a wife of Kamal Hassan in a movie.