కొడుకుతో రమ్యకృష్ణ ర్యాంప్ వాక్

Ramya Krishna ramp walk with his son

09:20 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Ramya Krishna ramp walk with his son

మొన్నే ఓ జ్యువెలరీ కంపెనీ కోసం అందాల నటి రమ్యకృష్ణ ఓ ఫొటోషూట్ చేసింది. ఆ ఫోటోషూట్లోనే తొలిసారి ఆమెను చూసిన వాళ్లను తన వయసెంతో అడిగితే ఏ పాతికో ముప్పయ్యో అంటారేమో. కానీ ప్రస్తుతం ఆమె వయసు 48 ఏళ్లు. దశాబ్దాలుగా రమ్యకృష్ణను చూస్తున్న వాళ్లకు కూడా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. 13 ఏళ్ల వయసులోనే నటనలోకి అడుగుపెట్టిన రమ్య 'చంద్రలేఖ' సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణవంశీతో ప్రేమలో పడటం.. 2003లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడిన రమ్యకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. కాకపొతే, ఆ పిల్లాడితో రమ్య కానీ.. కృష్ణవంశీ కానీ.. బయట కనిపించింది చాలా చాలా తక్కువ.

అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన కొడుకుతో కలిసి సందడి చేసింది రమ్య. ఓ సామాజిక కార్యక్రమంలో తన కొడుకు రిత్విక్ తో కలిసి రమ్య ర్యాంప్ వాక్ చేసింది. ఇలా కొడుకుతో కలిసి రమ్యను చూసేసరికి అక్కడి జనాలంతా ఆశ్చర్యపోయారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాక డల్ అయిపోయిన రమ్య కెరీర్.. గత ఏడాది బాహుబలిలో శివగామి పాత్రలో కనిపించాక మళ్లీ ఊపందుకుంది. దాని తర్వాత సోగ్గాడే చిన్నినాయనాతో మరో హిట్ కొట్టిన రమ్య ప్రస్తుతం తెలుగు-తమిళ భాషల్లో అరడజను దాకా సినిమాల్లో నటిస్తోంది. ఇంకా మున్ముందు మరిన్ని హిట్స్ కొత్తనుందని అంటున్నారు. మరి కొడుకుని కూడా హీరోగా దింపుతుందా? చూద్దాం.

English summary

Ramya Krishna ramp walk with his son. Veteran actress Ramya Krishna ramp walk with his son Rithvik.