'రోబో 2.0' లో శివగామి పాత్ర

Ramyakrishna in Robo 2

10:32 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Ramyakrishna in Robo 2

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'రోబో 2.0'. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అమీజాక్సన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సుమారు 400 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రజనీకాంత్‌-రమ్యకృష్ణ కలిసి నటించిన 'నరసింహ' చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. రోబో లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణ అయితే బాగుంటుందని శంకర్‌ అభిప్రాయమట.

అందుకే రమ్యకృష్ణ ని కలిసి అడగగా రమ్యకృష్ణ వెంటనే అంగీకరించిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనున్నారు.

English summary

Super Star Rajinikanth upcoming movie Robo 2.0. Amy jackson is romancing with Rajinikanth in this movie. Shankar is directing this movie. For latest updates Baahubali actress sivagami Ramyakrishna is acting this movie.