శృతిహాసన్ కి తల్లిగా రమ్యకృష్ణ!!

Ramyakrishna is acting as a mother for Shruti Hassan

03:51 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Ramyakrishna is acting as a mother for Shruti Hassan

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘అమ్మ నాన్న ఆట’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మళయాల దర్శకుడు టి. కె. రాజీవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ అమల అక్కినేని, జరీన వాహీబ్ లతో పాటు ఒక కొత్త అమ్మాయి కూడా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే కమల్ మళ్లీ రాజీవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కోసం కమల్ హాసన్ ఒక కథని కూడా సిద్దం చేసుకున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కి శృతి హాసన్ కూతురు గా కనిపించనుంది. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక చిత్రంలో కూడా నటించలేదు. అభిమానులకి కూడా ఆ లోటు మిగిలిపోయింది.

ఇప్పుడు ఆ లోటు తీరనుంది. అలాగే కమల్ కి జోడీగా, శృతికి తల్లి పాత్రలో రమ్యకృష్ణని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే రమ్యకృష్ణని కలిసి ఆ కథని కూడా వినిపించారు. రమ్యకృష్ణ కి కధ నచ్చినా 'బాహుబలి -2' షూటింగ్‌లో బిజీ గా ఉండడంతో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. మే లో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించనున్నారు.

English summary

Ramyakrishna is acting as a mother for Shruti Hassan in Kamal Hassan's movie. This movie is directing by K. Rajeev and Kamal Hassan is romancing with Ramyakrishna in this movie.