'కలియుగ భీమ' జీవిత కధలో రానా

Rana as Kaliyuga Bheema

12:25 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Rana as Kaliyuga Bheema

'లీడర్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రమే ఘన విజయం సాధించి, ఆ తరువాత వరుస ప్లాప్ లు మూటగట్టుకుని, ఆ తరువాత విలక్షణ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రానా. 'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవగా విలనిజాన్ని ఓ రేంజ్ లో చూపించిన రానా ఆ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరో పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రానా ఓ పాత్ర మీద మనసు పారేసుకున్నాడు. అదేంటంటే బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు చేసిన మల్లయోధుల తరహా పాత్రను చేసేందుకు రానా ఇష్టాన్ని కనబరుస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. దీంతో పాటు అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు. దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు. కుస్తీ పోటీల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించాడు రానా.

రానానే స్వయంగా చేస్తానంటే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్ లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం.

English summary

Rana as Kaliyuga Bheema