శ్రీనువైట్లకి హీరో దొరికేశాడు!

Rana Daggubati confirmed as a hero in Sreenu Vaitla direction

05:44 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Rana Daggubati confirmed as a hero in Sreenu Vaitla direction

ఆగడు, బ్రూస్‌లీ వంటి వరుస అట్టర్‌ఫ్లాపులతో శ్రీనువైట్ల కెరీర్‌ అటకెక్కేసినట్లు కనిపిస్తుంది. స్టార్‌హీరోల నుండి చిన్న హీరోలు వరకు శ్రీనువైట్లతో సనిమా చెయ్యాలంటే మోహం చాటేస్తున్నారు. తన దగ్గర ఉన్న కథతో చాలా మంది హీరోలు దగ్గరకి శ్రీనువైట్ల తిరిగినా, వాళ్ళెవరూ అంత ఇష్టం కనబర్చడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీనువైట్ల ఒక పెద్ద హీరోనే పట్టేశాడు. ఆ హీరో ఎవరో కాదు బాహుబలి లో తన నటనతో అవార్డు పొందిన భల్లాలదేవ రానా దగ్గుబాటి కి శ్రీనువైట్ల ఒక కథ చెప్పాడు. ఆ కథ రానాకి నచ్చడంతో వెంటనే శ్రీనువైట్ల తో చిత్రం చెయ్యడానికి అంగీకరించాడట.

అయితే ఈ చిత్రాన్ని రానా తండ్రి డి. సురేష్‌బాబు నిర్మిస్తారా లేక వేరే బ్యానర్‌లో నిర్మిస్తారా అనేది ఇంకా తెలీదు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతి లోపు ఈ చిత్రాన్ని ప్రారంభించాలని శ్రీనువైట్ల ఆలోచిస్తున్నాడట.

English summary

Rana Daggubati confirmed as a hero in Sreenu Vaitla direction. The shooting is going to start on Sankranthi.