ఈ చిత్రంతో నా కల నెరవేరింది..

Rana Daggubati fulfills his dream with this movie

11:59 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Rana Daggubati fulfills his dream with this movie

అప్పటి వరకు ఎటువంటి క్రేజ్ లేని రానా 'బాహుబలి' చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. రానా ప్రస్తుతం 'బాహుబలి -2' షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే మలయాళం లో సూపర్ హిట్ అయిన 'బెంగుళూరు డేస్' ని తమిళంలో ‘బెంగుళూరు నాట్కల్’ గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ 'బాహుబలి -2' షూటింగ్ ప్రారంభం కాక ముందే పూర్తి చేసేసారు. తాజాగా ఈ చిత్రం ఆడియో లాంచ్ ని చెన్నై లో నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ కి వచ్చిన రానా తన కల ఈ చిత్రంతో నెరవేరిందని చెప్పాడు.

నేను ఈ చిత్రం చూసినప్పుడు నాకు ఫహద్ నటించిన పాత్ర బాగా నచ్చింది. అలాంటి పాత్రలో నేను కూడా నటిస్తే బాగుంటుందని కలలు కన్నాను. ఈ చిత్రం తమిళంలో రీమేక్ చెయ్యాలి అనుకున్నాక నన్ను ఆ పాత్రలో నటించమని కోరారు. నాకు బాగా నచ్చిన పాత్ర కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ పాత్రతో నా కల నెరవేరింది అని రానా మాట్లాడాడు. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శుకుడు భాస్కర్ కి నా కృతఘ్నతలు అని రానా చెప్పారు. పివిపి పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రంలో ఇంకా ఆర్య, సమంత, పార్వతి మీనన్, శ్రీ దివ్య, బాబీ సింహా, రాయ్ లక్ష్మీ లు ముఖ్య పాత్రల్లో నటించారు. రానా హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఘజి’ సెట్స్ పై ఉంది.

English summary

Rana Daggubati fulfills his dream with Bangalore Naatkal movie. Bommarillu Bhaskar was directed this movie. Sri DIvya acted with Rana in this movie.