20గంటలు నాన్ స్టాప్ వార్

Rana Daggubati performs dangerous underwater war sequence for Ghazi

04:03 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Rana Daggubati performs dangerous underwater war sequence for Ghazi

గత ఏడాది ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ గా ఎదిగిన యంగ్ హీరో రానా దగ్గుబాటి. త్వరలోనే బాహుబలి 2 షూట్ లో దూకడానికి సిద్ధం అవుతున్నాడు. ఇది కాక రానా చేస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఘజి’. రాణి కథాంశంతో, పాకిస్థాన్ పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తీస్తున్నారు. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పివిపి నిర్మాత కాగా, సంకల్ప్ డైరెక్టర్. ఇక ఈ సినిమా కోసం ఓ పూల్ లో ఉండేలా రెండు సబ్ మెరైన్ సెట్స్ ని వేసారు.రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ లో అండర్ వాటర్ లో వచ్చే వార్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. స్వతహాగా రానాకు వాటర్ డ్రైవర్ గా అనుభవం ఉంది. అయినా సరే, ఈ సీన్స్ కోసం ముందు ట్రైనింగ్ అయ్యి తర్వాత షూట్ కి వెళ్ళాడు. ఈ వార్ ఎపిసోడ్ గురించి, రానా స్పందిస్తూ ‘వాటర్ డైవింగ్ లో నాకు అనుభవం ఉంది కానీ డైవింగ్ చేసి నాలుగేళ్ళు అవ్వడం వలన కాస్త ట్రైనింగ్ అవసరం అయ్యింది. ఉదయం 6 గంటలకి మొదలు పెట్టి రాత్రి 2 వరకూ అనగా 20 గంటలపాటు కంటిన్యూగా షూట్ చేసాం. ఇలా 3 రోజుల పాటు షూట్ చేసి ఒక అండర్ వాటర్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసాం. ఒక 12 రోజులు షెడ్యూల్ కి గ్యాప్ఇచ్చాం . మార్చి 10 నుంచి షెడ్యూల్ ని మొదలు పెట్టి ఎలాంటి గ్యాప్ లేకుండా షూట్ చేసి షూట్ కి గుమ్మడికాయ కొట్టేస్తామని’ అని వివరించాడు. ఓ పక్క బాహుబలి -2 కోసం రెడీ అవుతూ , మరో పక్క 'ఘాజి' కోసం చెమటోడుస్తున్న రామానాయుడు (రానా) 2016లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో.

English summary

Presently Rana Daggubati was busy with the film Bahubali 2 .He was also acting in Ghazi movie in that movie he was acting as a Naval officer.In this movie a under water sequence was shhoted by the movie unit.This Shooting was done 20 hours continuously.