హాలీవుడ్ ఆస్కార్ హీరోకి రానా డబ్బింగ్

Rana dubbing for Tom Hanks

01:24 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Rana dubbing for Tom Hanks

ఓ పక్క తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు ఆస్కార్ పురస్కారం సాధించిన హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్... మరోపక్క బాహుబలిలో భళ్లాలదేవగా కండలు తిరిగిన దేహం, గుండెలదిరే గంభీర స్వరంతో ప్రతినాయక పాత్రకు ప్రాణం పోసిన టాలీవుడ్ హీరో రానా... ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ సినిమాకు పనిచేస్తే... వూహించడానికే అద్భుతంగా ఉన్న ఈ కలయిక త్వరలో నిజం కాబోతోంది. టామ్ హ్యాంక్స్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం 'ఇన్ ఫెర్నో' లో రానా కూడా భాగమయ్యాడు. అయితే రానా ఇందులో కనిపించడు. కేవలం వినిపిస్తాడు. 'ఇన్ ఫెర్నో' తెలుగు వెర్షన్ లో టామ్ హ్యాంక్స్ నటించిన రాబర్ట్ లాంగ్ డన్ పాత్రకు రానా తన గొంతుతో జీవం పోయనున్నాడు.

ప్రస్తుతం 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రీకరణలో బిజీగా ఉన్న రానా 'ఇన్ ఫెర్నో' లోని కొన్ని సన్నివేశాలు చూశాడట. అవి ఆయనకు బాగా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడట. చిత్రీకరణ అయిపోయాక రాత్రిళ్లు డబ్బింగ్ చెప్పాడట. అన్నట్లు ఇందులో భారతీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇన్ ఫెర్నో చిత్రానికి పనిచేసిన అనుభవం గురించి రానా మాట్లాడుతూ టామ్ హ్యాంక్స్ గొప్ప నటుడు. ఆయన నటించిన చిత్రంలో నేనూ భాగమవ్వడం ఎంతో ఉద్వేగంగా ఉంది. నేను డబ్బింగ్ చెబుతున్న క్షణాలను రికార్డ్ చేసుకున్నాను. డబ్బింగ్ చెప్పడం ఓ నటుడిగా నాకెంతో ఉపయోగపడింది.

ఓ విధంగా అది టామ్ హ్యాంక్స్ నుంచి శిక్షణ తీసుకోవడం లాంటిదే. భళ్లాలదేవ, రాబర్ట్ లాంగ్ డన్.. ఈ రెండు నా జీవితంలో గర్వంగా చెప్పుకునే పాత్రలుగా నిలుస్తాయి. ఓ మంచి కథను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువచేసేందుకు గతంలో ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పడం శుభపరిణామం. వారి సరసన నేనూ చేరడం ఆనందంగా వుంది అని రానా ఉబ్బితబ్బిబ్బయ్యారు.

English summary

Rana dubbing for Tom Hanks