'భల్లాలదేవ'కి ఫస్ట్ అవార్డ్..

rana got first award for bhallaladeva character in baahubali

06:39 PM ON 21st November, 2015 By Mirchi Vilas

rana got first award for bhallaladeva character in baahubali

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. వెండితెర పై రాజమౌళి సృష్టించిన ఒక అధ్బుత ప్రపంచం బాహుబలి అని చెప్పొచ్చు. తాజాగా ఇందులో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా నటించిన భల్లాలదేవకు(రానా) మొట్టమొదటి అవార్డు దక్కింది. ఇందులో బాహుబలి పాత్రకు గట్టి పోటీని ఇచ్చే భల్లాలదేవ పాత్రలో రానా దగ్గుబాటి చక్కని నటనతో, మంచి విలనిజమ్ తో నటించి అందరి ప్రశంసలు పొందాడు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా విజన్ ఫిల్మ్ అవార్డ్స్-2016లో రానాకి అవార్డు దక్కింది.

ఈ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక డిసెంబర్ 2న దుబాయ్ లో వైభవంగా జరగనుంది. ఇదే విషయాన్ని రానా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తూ ఆ అవార్డు రావడం పట్ల తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం రానా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. జనవరి 2 నుంచి బాహుబలి పార్ట్-2 షూటింగ్ లో రానా పాల్గొంటాడు.

English summary

rana got first award for bhallaladeva character in baahubali