వామ్మో! రానా బాడీ చూసారా?

Rana in Baahubali The Conclusion

06:03 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Rana in Baahubali The Conclusion

'బాహుబలి ద బిగినింగ్' కంటే 'బాహుబలి ది కన్ క్లూజన్' లో క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడ్డానని అంటున్నాడు రానా. ఈ రోల్ కోసం అవసరమయ్యేలా తీవ్రమైన కసరత్తు చేసినట్టు తెలిపాడు. కోచ్ కునాల్ గిర్ పర్యవేక్షణలో రోజూ రెండున్నర గంటల పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. బాహుబలి -2 లో తన షెడ్యూల్ భిన్నంగా ఉండడంతో కార్డియో, వెయిట్ ట్రైనింగ్ లో వేర్వేరు రకాల శిక్షణ తీసుకుంటున్నట్టు చెబుతున్నాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో మరింత ఫిట్ గా రానా కనిపించనున్నాడు. బాహుబలి మొదటి భాగంలో 108 కిలోల నుంచి 110 కిలోల బరువు ఉండగా.. రెండో భాగం కోసం సుమారు 93 కిలోలకు బరువు తగ్గాడట.

రానా డైట్ ను కునాల్ ప్రిపేర్ చేశాడని, నూనె లేకుండా ప్రతి రెండున్నర గంటలకోసారి పోషకాహారం తీసుకుంటున్నాడని తెలిసింది. తన బాడీ ఫోటోని రానా ట్విటర్ లో పెట్టి తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

English summary

Rana in Baahubali The Conclusion