రెండు హిట్లు మిస్‌ చేసుకున్న 'రానా'!!

Rana missed two super hits in his career

06:23 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Rana missed two super hits in his career

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి. అయితే బాహుబలి చిత్రం కారణంగా రానా రెండు సూపర్‌ హిట్‌ చిత్రాలు మిస్‌ చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవి కళ్యాణ్‌రామ్‌ నటించిన 'పటాస్‌' ఒకటి కాగా మరొకటి తమిళంలో రూపొందిన 'తని ఒరువన్‌' ఒకటి. 2015 జనవరి లో విడుదలైన 'పటాస్‌' మొదట రానా దగ్గుబాటితో తెరకెక్కించాలని ఆ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి రానాని కలిశారట. అయితే బాహుబలి చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల రానా ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత హను కళ్యాణ్‌రామ్‌ ని సంప్రదించారు.

మరొకటి 'తని ఒరువన్‌' ఇది కూడా మొదట రానాతోనే తెరకెక్కించాలని భావించారు కానీ బాహుబలి చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల రానా తన డేట్స్‌ని అడ్జస్ట్‌ చెయ్యలేక ఈ చిత్రాన్ని కూడా వదలుకున్నాడు. ఆ తరువాత ఇందులో జయం రవి నటించి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు 'తని ఒరువన్‌' చిత్రాన్ని రామ్‌ చరణ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల్ని వదులుకున్నా బాహుబలి చిత్రంతో నాకు మంచి గుర్తింపు వచ్చిందని నా నటనకు గానూ అవార్డు కూడా గెలుచుకున్నానని రానా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

English summary

Rana missed two super hits in his career. One is Kalyan Ram's Pataas and another one is tamil super hit Thani Oruvan.