నాకు కుడి కన్ను కనిపించదు

Rana Says That He Cant See With His Right eye

04:00 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Rana Says That He Cant See With His Right eye

సమాజంలో ఆర్దికంగా బాధపడుతున్న వారి కుటుంభాలకు తమ వంతు సాయం చెయ్యాలనే ప్రధాన ఉద్దేశంతో మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి చేపట్టిన "మేము సైతం" ప్రోగ్రాం నిన్న ప్రారంభం అయ్యింది.

ఇవి కుడా చదవండి :విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

నిన్న జెమినీ టీవీ లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో హీరో రానా ,మంచు లక్ష్మి లతో పాటు నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కుడా పాల్గొంది. ఒక కంటిని పూర్తిగా కోల్పోయిన ఒక మహిళా కుటుంభం కోసం రానా కులీగా మారి మూటలు మోసాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి సైతం కుడా కంటిని కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఆ మహిళ పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితం విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇవి కుడా చదవండి :సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ "తనకు కుడా చిన్నప్పుడు కుడి కన్ను కనిపించేది కాదని , ఒక కంటి సహాయంతోనే చూసే వాడినని చెప్పాడు. ఆ తరువాత ఒక దాత సహాయం చెయ్యడంతో ఐ - ట్రాన్స్ ప్లాంటెషన్ ఆపరేషన్ చేయించుకున్న తరువాత నే తాను రెండు కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నానని , ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుందని , ఆ సమస్యలకు మనం ఎదురోడి నిలిచి ముందుకు సాగాలని చెప్పుకోచ్చాడు".

ఇలా ఒక క్రేజ్ ఉన్న హీరో,రానా తనకున్న లోపం గురించి అందరి ముందు నిరభ్యంతరంగా మాట్లాడి చాలా మందిలో స్ఫూర్తి నింపాడని చాలామంది రానా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రానా మాట్లాడిన వీడియో పై మీరు ఓ లుక్కేయండి......

ఇవి కుడా చదవండి :

సింగర్ పై సీరియస్ అయిన త్రిష

తన 150వ చిత్రం టైటిల్ ను ప్రకటించిన చిరు..

English summary

Hero Rana Says that at his childhood time he can't see with his right eye and after the eye transplantation he was able to see his right eye. He participated in Memu Saitam Program which was tele casted on Gemini Tv