బాహుబలికి వధువును వెతుకుతున్న బల్లాలదేవ

Rana searching bride for Prabhas

02:44 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Rana searching bride for Prabhas

36 ఏళ్ళ యోధుడు, గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చిన సేనాధిపతి, 6 అడుగుల 2 అంగుళాల ఆజానుబాహుడు ఇంటి పనులలో సాయం చేస్తాడు. పెళ్ళి గురించి ప్రస్థావిస్తే కొండలెక్కేస్తాడు. కానీ అపరిచితుడు కాదు. అలంకరణ చేయడంలో ప్రవీణ్యుడు పెళ్ళి కూతుర్ని అందంగా తయారు చేస్తాడు. ఇవి మా బాహుబలి(ప్రభాస్)లో ఉన్న లక్షణాలు. మరి మా బాహుబలికి కాబోయే వధువుకి ఉండాల్సిన లక్షణాలు కూడా చెపుతాం చూడండి.


1. మా బాహుబలి(ప్రభాస్) చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలంటే, ఒకవేళ ఆ అమ్మాయి ని ఎవరైనా ఎత్తుకుపోతే ‘బాహుబలి’ ప్రాణాలుకు సైతం లెక్కచేయకుండా శిఖరాలు, అడవులు, మంచుశిఖరాలు దాటుకుని ఆమెను కాపాడుకునేంత అందగత్తె అయి ఉండాలి.


2. యుద్ధవిద్య మరియు విలువిద్యలలో ప్రధాన మెలకువలు తెలిసి ఉండాలి.


3. కఠినమైన జైలుశిక్ష అనుభవిస్తున్న అత్తను గౌరవించాలి.


4. ఇంటి పనులలోనూ, శతృవులను ఓడించడానికి చేసే సైనిక వ్యూహాలలోనూ సాయం చెయ్యాలి.


'బల్లాలదేవుడు'(రానా) ఇలా తన అన్న 'బాహుబలి'(ప్రభాస్) కోసం ఒక వినూత్నంగా వధవు కావలెను అంటూ ఒక లేఖను ఇంటెర్నెట్ లో పెట్టాడు. రానా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఆహ్వాన ప్రతం ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. చాలా మందిని దీనిని ప్రశంసించారు కూడా.

బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్‌లు అన్నదమ్ములు అయినప్పటికీ విరోధులుగా కనిపిస్తారు. బాహుబలి2 కథలో బల్లాలదేవుడు (రానా), బాహుబలి ఒకే అమ్మాయి దేవసేనను ప్రేమిస్తారు. కానీ దేవసేన మాత్రం బాహుబలినే ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. కానీ నిజ జీవితానికి వచ్చే సరికి మాత్రం రానా ప్రభాస్ కోసం పిల్లను వెతికే పని పడ్డం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

English summary

Rana searching good bride for Prabhas. Rana put a variety wedding card for Prabhas.