మహేష్‌ కాళ్లకు నమష్కరించిన రానా!!

Rana touches Mahesh Babu foot for blessing

03:22 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Rana touches Mahesh Babu foot for blessing

సుధీర్‌బాబు నటించిన 'భలే మంచి రోజు' చిత్రం ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిధిలుగా మహేష్‌బాబు, రానా దగ్గుబాటి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌లో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్షణ కాలంలో ఈ సంఘటన జరగడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ రానా మహేష్‌బాబు పాదాలకి నమష్కరించాడు. అవును ఆ విషయాన్ని చాలా మంది గుర్తించలేదు, ఫంక్షన్‌కి ముందుగా మహేష్‌బాబు వచ్చారు ఆ తరువాత కొద్దిసేపటికే రానా వచ్చి సుధీర్‌బాబుని హగ్‌ చేసుకుని కూర్చుని ఉన్న మహేష్ బాబు పాదాలకు నమష్కరించాడు. రానా అలా చెయ్యడంతో మహేష్‌ ఒక్క సారిగా షాకై రానాని నవ్వుతూ చూసేసరికి రానా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.

ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా ఇలా ఏ మాత్రం అహం లేకుండా ఒక హీరో పాదాలకి నమష్కరించాడంటే తన క్యారెక్టర్‌లోని గొప్పతనాన్ని చాటు చెప్తుంది. రానా బహుబలి ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా ప్రభాస్ని చాలా బాగా గౌరవించాడు, తోటి హీరోలకి రానా ఎంతో గౌరవం ఇస్తాడని తెలిసిందే.

English summary

Rana touches Mahesh Babu foot for blessing in Bhale Manchi Roju audio function.