కాజల్ ని ఆశీర్వదిస్తున్న బాబా ఎవరో తెలుసా?

Rana younger brother Abhiram blessing Kajal Agarwal

11:20 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Rana younger brother Abhiram blessing Kajal Agarwal

మామూలు జనం కన్నా సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, భక్తి కూడా ఎక్కువే. ఇక కొందరు తారలైతే, స్వామీజీల వెంట పడడం కూడా షరా మామూలే. కానీ ఇక్కడ రియల్ స్వామీ కాదు అయినా అతడి ఆశీర్వాదం తీసుకుంది సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ గా వెలుగుతోన్న కాజల్ అగర్వాల్. ప్రస్తుత స్టార్ హీరోలందరితోనూ చేసిన కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించేస్తోంది. అలాంటి కాజల్ భక్తిగా ఓ వ్యక్తికి నమస్కరించి ఆశీర్వచనాలు అందుకోవడంతో చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒకవేళ మళ్లీ 'మగధీర' వంటి అవకాశాలు ఇప్పించమని బాబాల చుట్టూ తిరుగుతోంది అనుకుంటున్నారా? ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బాబా కాదు. ప్రముఖ నటుడు రానా తమ్ముడు అభిరామ్. వివరాల్లోకి వెళ్తే..

అసలు విషయం తెలిసింది. కాజల్ తొలిసారిగా కండలవీరుడు రానాతో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటిస్తుండడం కూడా తొలిసారే. అందుకే కాజల్ ను ఆహ్వానిస్తూ, రానా బ్రదర్ అభిరామ్ ఇలా ఆశీర్వదిస్తున్నాడన్నమాట. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary

Rana younger brother Abhiram blessing Kajal Agarwal