రణబీర్‌ కపూర్‌కి 38 కోట్లా???

Ranbeer Kapoor takes remmuneration 38 crores for Tamasha movie??

07:01 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Ranbeer Kapoor takes remmuneration 38 crores for Tamasha movie??

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన తాజా చిత్రం 'తమాషా'. ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. పది రోజుల క్రితం రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి 75 కోట్లు ఖర్చు పెడితే మొదటి పది రోజులకి 61.23 కోట్లు వసూళ్లు మాత్రమే రాబట్టింది. అయితే బాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ప్రచారం దుమారం రేపుతుంది. అదేంటంటే 'తమాషా' చిత్రానికి 75 కోట్లు ఖర్చు పెడితే అందులో 38 కోట్లు రణబీర్‌ కపూర్‌ పారితోషికం తీసుకున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఇది విన్నవారు మాత్రం రణబీర్‌ కపూర్‌ నటించిన గత మూడు చిత్రాలు భేషారం, రాయ్, బొంబే వెల్వెట్‌ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌లు అయ్యాయి. తమాషా చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రణబీర్‌ కపూర్‌కి 38 కోట్లు పారితోషికం ఇచ్చేంత సీన్‌ లేదని అనుకుంటున్నారు. రణబీర్‌ 38 కోట్లు తీసుకున్నాడంటే మీరు నమ్ముతారా?

English summary

Ranbeer Kapoor takes remmuneration 38 crores for Tamasha movie?? Inthiyaz Ali directed this movie and Deepika Padukone paired with Ranbeer Kapoor.