రణబీర్ తో హద్దు దాటేసిన ఐష్(వీడియో)

Ranbir Kapoor and Aishwarya Rai hot in Bulleya video song

11:01 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Ranbir Kapoor and Aishwarya Rai hot in Bulleya video song

కొత్త సినిమా అందునా హాట్ హాట్ సీన్స్ ఉంటే ఇక చెప్పక్కర్లేదు. ఇదిగో సరిగ్గా యే దిల్ హై ముష్కిల్ మూవీ బాలీవుడ్ జనాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి అందరి నోళ్ళల్లో నానోతోంది. రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, ఫవాద్ ఖాన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు/నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఐష్, రణబీర్ ల రొమాన్స్ సీన్లు శ్రుతిమించినట్లు ట్రైలర్ ద్వారా తేలిపోతోందని అంటున్నారు. శుక్రవారం కరణ్ ట్విట్టర్ ద్వారా బుల్లేయా.. పాటను విడుదల చేశాడు. దాంట్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెరిగి.. సీన్లు కాస్తా రొమాంటిక్ గా ఉన్నాయి.

దీంతో ఈ పాట ఆన్-లైన్ లో వైరల్ గా మారింది. మరో పక్క బచ్చన్ ఫ్యామిలీ ఈ సినిమాపై ముందు నుండి ముభావంగానే ఉన్నారు. తనకంటే వయసులో చిన్నవాడైన రణబీర్ తో ఐశ్వర్య హద్దుమీరిన సన్నివేశాల్లో నటించడం వారికి ఇష్టం లేదని... దాంతో బచ్చన్ కుటుంబం ఐష్ పై గుర్రుగా ఉన్నట్లు ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. పైగా యే దిల్ హై ముష్కిల్ ట్రైలర్ విడుదలై చాలా రోజులువుతున్నా ఇప్పటివరకు ఈ ట్రైలర్ ను అమితాబ్ ఇంకా చూడలేదని ఇటీవల మీడియాతో ద్వారా వెల్లడించారు. కరణ్ జోహార్ దర్శకుడిగా/ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకి వస్తుందట.

English summary

Ranbir Kapoor and Aishwarya Rai hot in Bulleya video song