రెమ్యున రేషన్ రెట్టింపు పెంచేసాడు

Ranveer Singh Increases His Remuneration

01:13 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Ranveer Singh Increases His Remuneration

అవునా , అంటే అవునని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే, ‘బాజీరావ్‌ మస్తానీ’ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో చేరిన రణ్‌వీర్‌ సింగ్‌ పారితోషికం అమాంతం పెంచేశాడట. తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ యువ నటుడు తన తదుపరి సినిమాలకు రెట్టింపు రెమ్యునేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. ‘బాజీరావ్‌’తో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్‌ సింగ్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. దీంతో పారితోషికం పెంచేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు సినిమాలతో పాటు తాను చేస్తున్న వాణిజ్య ప్రకటనలు, స్టేజ్‌ షోల రెమ్యురేషన్‌ కూడా రణవీర్‌ పెంచేశాడట. ప్రస్తుతం ఒక్కో స్టేజ్‌ షోకు సుమారు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కలెక్షన్ల విషయంలో షారూఖ్‌ఖాన్‌తో పోటీ పడుతున్న ఈ హీరో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో షారుక్‌తో కలిసి నటిస్తున్నాడు. మొత్తానికి రణవీర్ సింగ్ రేమ్యూనరేషన్ రెట్టింపు చేసెయ్యడం పై రకరకాల కామెంట్లు పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

సుమను ఎంటర్టైన్మెంట్ మినిస్టర్ చేస్తా!

టోపీ కోసం పులి బోనులోకి వెళ్ళింది.. ఏమైందో చుడండి?

English summary

At Present Bollywood Hero Ranveer Singh was the most desirable hero in Bollywood. According to a news that Ranveer Singh increased his remuneration and he was demanding 2 crores fora stage show.