‘బ్రహ్మోత్సవం’లో రావు గోపాలరావు 

Rao Gopal Rao Character In Brahmotsavam Movie

04:17 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Rao Gopal Rao Character In Brahmotsavam Movie

"మడిసన్నాక కాసింత కళా పోసన వుండాలి" వంటి పంచ్ డైలాగులు , పవర్ ఫుల్ డైలాగులు చెప్పి , తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రావు గోపాలరావు చాలాకాలం తర్వాత ‘బ్రహ్మోత్సవం’ లో సందడి చేసాడు. ఇదేమిటి ఎప్పుడో పోయిన రావు గోపారావు మళ్ళీ ఎలా వచ్చాడని ఆశ్చర్య పోతున్నారా? అదే లాజిక్కు మరి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సమయోచితంగా రావు గోపాలరావు ని వాడేసుకున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ గా తెరకెక్కిన ఈసినిమాలో రావు రమేష్ ది నవ్వు లేని డిఫరెంట్ క్యారక్టర్. అతడి చేష్టలకు చురకలు అంటించే విధంగా రావు గోపాలరావుని దర్శకుడు భలే వినియోగించుకున్నాడు. రావు గోపాలరావు యానిమేషన్ చిత్రం ప్రత్యక్షమై రావు రమేష్ కి హిత బోధ చేసే సీన్లు పండాయి. మిమిక్రి కూడా అదిరింది. ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా సమయోచితంగా ఇలాంటి సీన్లు నడిపించాడు దర్శకుడు. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు కూడా.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:చిరంజీవితో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్

ఇవి కూడా చదవండి:కోటి రూపాయల ఆఫర్ వదిలేసిన హీరోయిన్

English summary

Director Srikanth Addala and Mahesh Babu's recent flick was Brahmotsavam and Srikanth Addala used Veteran Legendary Sctor rao Gopal Rao as animation in this movie.