రావురమేష్ ని భరించలేమంటున్న చిన్న నిర్మాతలు

Rao Ramesh remuneration per day

12:05 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Rao Ramesh remuneration per day

ఒకప్పుడు డైలాగ్ లతో దంచేసిన విలక్షణ నటుడు రావు గోపాలరావు అంటే అందరికీ గుర్తే. మడిసి అన్నాకా కాసింత కళా పోషణ ఉండాలి అంటూ ఆంధ్రదేశంలో తన హవా సాగించిన రావు గోపాలరావు మరణించాకా ఆస్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే ఆయన నట వారసుడిగా తెరంగేట్రం చేసి అంచెలంచెలుగా టాలీవుడ్ లో తన సీనియర్ ప్రకాష్ రాజ్ ప్లేస్ ని రీప్లేస్ చేసేంతగా ఎదిగిన రావు రమేష్ ఇప్పటి వరకూ చిన్న, పెద్ద సినిమాలకు అందుబాటులో వుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా హిట్టైన అ.. ఆ మూవీతో తన రెమ్యునరేషన్ ని రావు రమేష్ అమాంతం పెంచేశాడట.

ప్రస్తుతం రోజుకి రెండు నుంచి రెండున్నర లక్షలు ఇస్తేనే తన కాల్ షీట్స్ ఇస్తున్నాడట. దీంతో చిన్న సినిమాలకు అందుబాటులో లేకుండా పోతున్నాడని టాలీవుడ్ టాక్. దీంతో ఇక, తమ చిన్న సినిమాలకు రావు రమేష్ స్థానంలో వేరొకరిని తీసుకొనే పరిస్థితులు వచ్చాయని చిన్న నిర్మాతలు వాపోతున్నారట. సీనియార్టీ వస్తే, మార్కెట్ లో క్రేజ్ ఉంటే, అడిగినంత ఇవ్వక చస్తారా ఏమిటి అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

English summary

Rao Ramesh remuneration per day