యువతి పై అత్యాచారం.. ఆ పై పెట్రోలు పోసి మర్డర్

Rape and murder in Kuppam

10:13 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Rape and murder in Kuppam

రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతూనే వున్నాయి. తాజాగా చిత్తూరు-కర్ణాటక సరిహద్దులో దారుణం జరిగింది. ఒక యువతి పై అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. వి. కోట సమీపంలోని శీతంపల్లె వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు వర్తమానం అందించారు. దీంతో కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా యువతి మృతదేహం కనిపించింది. యువతి పై అత్యాచారం చేసి దారుణంగా కొట్టి ఆ తరువాత కిరోసిన్‌ పోసి నిప్పటించినట్లు పోలీసులు నిర్ధారించారు.

అయితే సంఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. కర్ణాటక రాష్ట్రానికి అతి సమీపం కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన యువతిగానే పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Rape and murder in Kuppam.