మైనర్ పై బీ టెక్ విద్యార్ధి అత్యాచారం 

Rape on 12 year minor girl

12:08 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Rape on 12 year minor girl

అవమానంతో నిప్పంటించుకున్న బాలిక

రోజు రోజుకు మహిళలపై మరీ ముఖ్యంగా అభం శుభం ఎరుగని చిన్నారులపై లైంగిక దాడులు ఇటీవల పెరిగిపోయాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా , ఎంత చైతన్యం కల్పించినా అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా లో ఓ మైనర్ బాలికపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయతించి , చావుబతుకుల్లో కొట్టు మిట్టాడుతోంది.

వివరాల్లోకి వెళితే బాల్కొండ మండలం బోడేపల్లికి చెందిన తొమ్మిదోతరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా బిటెక్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆమె ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ స్పందించి , సుమోటోగా స్వీకరించిన కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్‌ఖాన్ సమగ్ర నివేదిక అందజేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మరో ఐదు లక్షలతో ఆ బాలికకు వైద్యం చేయించాలని కూడా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

మైనర్ బాలికపై లైంగికదాడి ఒడిగట్టిన ఆరోపణపై అదే గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బొబ్బిలి నర్సయ్య అలియాస్ నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. యాభై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికను వైద్యచికిత్సల కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సారా మాథ్యుస్, కుదీశ్ తబసూమ్, అనిత, సనా వాహబ్, కురల్ రసన్ శుక్రవారం కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె బంధువులను కలిసి విచారించింది.

బాలికను ముందుగా , నిజామాబాద్ ప్రభుత్వ ఆడుపత్రిలో చేర్పించగా, నిజామాబాద్ ఎంపీ కే కవిత కార్పొరేట్ దవాఖానకు తరలించాలని ఎస్పీ, కలెక్టర్లకు సూచించడంతో, బాలికను అపోలోకు తీసుకొచ్చినట్టు రసూల్‌ఖాన్ తెలిపారు. బాలికను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపిన ఎంపీ కవిత, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లను మైనారిటీ కమిషన్ అభినందించింది. మరి ఈ అంతులేని ఆగడాలకు విముక్త్గి ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు.

English summary