అత్యాచారం చేసి, కాల్పులు జరిపి ..

Rape On 15 Year Old Girl

06:43 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Rape On 15 Year Old Girl

ఎక్కడ చూసినా , ఎక్కడ విన్నా ఏమున్నది గర్వకారణం ... మహిళలపై , అభం శుభం తెలియని మినార్లు , చిన్నారులపై లైంగిక దాడులు , అత్యాచారాలు తప్ప .... తాజాగా ఓ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన అత్యంత దారుణం. ఓ పదిహేనేళ్ల బాలిక పట్ల దుండగులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆమెపై వారం రోజులుగా అత్యాచారం చేసి, ఆమెను తుపాకితో రెండు సార్లు కాల్చి, మరణించిందని భావించి బావిలో పడేశారు. ఆమె పది గంటల పాటు సాయం కోసం కేకలు పెడుతూ చివరకు ప్రాణాలతో బయటపడింది. గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామంలో గల ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే,

పశ్చిమ ఢిల్లీలోని ఇంటి నుంచి నవంబర్ 22వ తేదీన బాలికను కారులో దుండగులు కిడ్నాప్ చేశారు, గ్రేటర్ నోయిడాలోని ఓ పాడుబడ్డ ఫామ్‌హౌస్‌లో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె ఛాతీపై, కడుపుపై కాల్పులు జరిపారు. మరణించిందని భావించి బావిలో పడేశారు. ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు. రక్తమోడుతున్న ఆ అమ్మాయి శక్తి నంతా కూడాదీసుకుని, తన శరీరంలో ఓ బుల్లెట్‌ను స్వయంగా ఆమె తీసేసుకుంది. అక్కడే జీవచ్చవం లా పడివున్న ఆమె బావిలోంచి కేకలు వేస్తూనే వుంది.

డిసెంబర్ 6వ తేదీన ఆ పొలం యజమాని మేనల్లుడు ఆడుకుంటూ బావి వద్దకు వచ్చాడు. అతనికి అమ్మాయి అరుపులు వినపించాయని, తాను అతడి మాటలు నమ్మలేదని, తర్వాత వెళ్లి చూస్తే నిజంగానే బాలిక అరుపులు వినిపించాయట. దీంతో పోలీసులకు విషయం చెప్పి బావిలోకి తాళ్లు వేశానని పొలం యజమాని వివరించాడు.

ఆమెను జాగ్రత్తగా పైకి లాగి, ఆమె ఒంటిపై దుప్పటి కప్పారు. తర్వాత ఆమమను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు క్రిషన్ కొద్ది నెలలుగా తనకు తెలుసునని ఆ బాలిక చెప్పింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా వున్నారు. చివరగా ఇంటికి తీసుకుని వెళ్తామని చెప్పిన నిందితులుదాహం తీర్చుకోవడానికి ఓ బావి వద్దకు బాలికను తీసుకుని వెళ్లారు. తీరా ఆమె అక్కడి నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయడంతో, క్రిషన్ ఆమెను పట్టుకుని కొట్టాడు, రెండు సార్లు ఆమెపై కాల్పులు జరిపాడు. కొసమెరుపేమంటే, బుల్లెట్లు ఆమె శరీరానికి నష్టం కలిగించలేదు. దీంతో ఆమె బతికి బయటపడింది.

English summary

A 15 year old girl was raped and tried to kill her by shooting with gun and then she thrown her in bore well.This incident was occured in greater noida