దారుణం: ఒకటో తరగతి చిన్నారిపై అత్యాచారం.. ఆపై..

Rape on 1st class child

12:23 PM ON 10th November, 2016 By Mirchi Vilas

Rape on 1st class child

ఆడపిల్లలపై అందునా చిన్నారులపై కామాంధుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా రోజూ ఏదో ఓ చోట దారుణం జరిగిపోతూనే వుంది. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజానికి వారం క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ప్యాపిలికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బాలిక బడికి వెళ్తుండగా జక్కలచెరువు మధు అనే వ్యక్తి బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలులో వైద్యచికిత్సలు అందిస్తున్నారు. నిందితుడికి భయపడిన బాలిక కుటుంబీకులు బయటకు చెప్పుకోలేక పోయారు. చివరకు మహిళా సంఘాలకు తెలిసి ఈనెల 7న పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు బుధవారం పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం జాతీయ రహదారిపై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. రెండుగంటల సేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. డోన్ డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

Rape on 1st class child