863ఏళ్ళ తరువాత వచ్చిన అరుదైన నెల.. ఇందులో విశేషమేమిటంటే..

Rarest october month repeats after 863 years

05:09 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Rarest october month repeats after 863 years

ఈ ఏడాది ఇప్పుడు వస్తున్న అక్టోబర్ కి ఎంతో ప్రత్యేకత ఉందట. ఇది చాలా అరుదైన నెల. 8 శతాబ్ధాల తర్వాత వస్తోంది. కాకతీయ రాజుల కాలం నాటి నెల ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఒకే నెలలో మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు కలిసి వచ్చిన అత్యంత అరుదైన నెలగా చెబుతున్నారు పండితులు. సరిగ్గా 863 ఏళ్ల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఇలాంటి నెల వచ్చింది. ఈ నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలున్నాయి. పండగలే పండగలు, పైగా సెలవులే సెలవులు. బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా అన్నీ ఒకే నెలలో వస్తున్నాయి.

సాధారణంగా ఒకే నెలలో ఇన్ని రావు. అంతేకాదు పౌర్ణమి, అమావాస్యలు కూడా ఒకే నెలలో వస్తున్నాయి. రెండో శనివారం కూడా కలిసి రావడంతో, స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున సెలవులు వస్తున్నాయి. దసరా సెలవులతో కలిపి దాదాపు 15 రోజులు విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటారు. ఐటీ ఎంప్లాయిస్ అయితే 12 రోజులు సెలవుల్లో ఉంటారు.

1/2 Pages

ఈ అక్టోబరు ప్రత్యేకతలు:

ఆదివారాలు: 2, 9, 16, 23, 30

సోమవారాలు: 3, 10, 17, 24, 31

శనివారాలు: 1, 8, 15, 22, 29

పండగలు: బతుకమ్మ సంబురాలు, దసరా(11), పీర్ల పండుగ(12), దీపావళి(30)

English summary

Rarest october month repeats after 863 years