అమెరికాలో తెలంగాణ ఎంఎల్ఏ సీరియస్

Rasamayi Balakishan Serious At ATA Conference

11:25 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Rasamayi Balakishan Serious At ATA Conference

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే.. రసమయి బాలకిషన్ కు కోపం వచ్చింది. అందుకే ఈయన 'నేను ఎమ్మెల్యేని.. కేబినెట్ మినిస్టర్ ర్యాంకు కల్గిన సాంస్కృతిక సారధి ఛైర్మన్ నేను.. ఈ వేదిక మీద తాను పాట పాడటమన్నది మీ అదృష్టంగా భావించుకో' అంటూ సీరియస్ అయ్యారు. చికాగోలో జూలై1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. జీవితంలో ఇక మీ ఆటా ప్రోగ్రామ్ లో మా తెలంగాణ పాట ఉండదని ఆయన అనేసారు. ఏకంగా స్టేజ్ పైన తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఇంతకీ రసమయి కోపానికి కారణమైన విషయం ఏంటంటే, స్టేజ్ పైకొచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు మణిశర్మ ప్రోగ్రామ్ ఇస్తారు..ఆయన రెడీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది ఈలోపు రసమయి బాలకిషన్ పాడతారని చెప్పడంతో స్టేజ్ మీదకి బాలకిషన్ వచ్చి పాడేందుకు సిద్దపడ్డ బాలకిషన్ ను కొందరు అడ్డుకున్నారు. కేకలు, అరుపులతో అతని ప్రోగ్రామ్ ని ఆపడానికి ప్రయత్నంచడంతో రసమయి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:సెంట్రల్ జైల్ ని మరపించే హోటల్

ఇవి కూడా చదవండి:రాత్రి 7 తరువాత ఈ తప్పులు చేయకూడదట

English summary

Telangana MLA Rasamayi Balakrishna was participated in ATA Conference in Chicago in America and he was quite disappointed with the organizers on ATA.