100 మంది చిన్నారుల కోరిక తీర్చిన రాశి

Rashi Helps To Orphan Childrenr Children

06:19 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Rashi Helps To Orphan Childrenr Children

అందాల నటి రాశి ఇటీవలే ఒక విషయం పై డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళిని కలిసింది. అయితే రాశి బాహుబలిలో నటించడం కోసమో లేక స్పెషల్‌ అప్పీయరెన్స్‌ కోసమో రాజమౌళిని కలవలేదు. కొంత మంది అనాధ పిల్లల కోసం అతన్ని కలిసింది. వివరాల్లోకెలితే రాశికి ఒక చిన్న కూతురు ఉంది. ఒక టీవీషోకి రాశి గెస్ట్‌గా వచ్చినప్పుడు నా కూతరి ప్రతీ పుట్టినరోజు నాడు కొంతమంది అనాధ పిల్లలకి టిఫిన్‌, భోజనం ,డిన్నర్‌ నేనే ఏర్పాటు చేస్తాను అని చెప్పింది.అయితే కొంతకాలం తరవాత రాశి ఇటీవలే అనాధ పిల్లల ఆశ్రమంకి వెళ్లి ఆ పిల్లలతో చాలా సేపు ముచ్చటించింది. ఆ మాటల్లో ఆ పిల్లలు ఇంతవరకు ధియేటర్‌కి వెళ్లి ఒక్క సినిమా కూడా చూడలేదని తెలుసుకుంది. ఆ పిల్లలు బాహుబలి చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారని అడిగి తెలుసుకుంది. అప్పుడు రాశి ఆ పిల్లలు కోరికను ఎలా అయినా తీర్చాలని బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళిని కలుసుకుంది. ఆ అనాధ పిల్లల గురించి వివరించింది. ఆ విషయాన్ని అర్ధం చేసుకున్న రాజమౌళి వెంటనే ఆమె కోరికను అంగీకరించాడు. 100 మంది అనాధ పిల్లలు ప్రసాద్స్‌ ఐమాన్స్‌లో చూడటానికి గానూ ఐమాక్స్‌ అధినేత వద్ద అంగీకారం తీసుకున్నాడు రాజమౌళి. ఆ చిన్నారుల కోరిక నెరవేరుస్తున్నందుకు రాశిని, రాజమౌళిని కచ్చితంగా అభినందించాల్సిందే.

English summary

Veteran Actress Rashi helps to Orphan Child children in many ways recently some of the Orphan Children child asked rashi that they want to see movies in theatre . Raashi had shown bahubali movie to 100 Orphan Children in Imax with the help of S.S.Rajamouli