ఆ మూడే సక్సెస్ తెచ్చాయట

Rashi Khanna About Her Personal Life

09:54 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Rashi Khanna About Her Personal Life

జోరు చూపిస్తున్న నవతరం కథానాయికల జాబితాలో తప్పకుండా వుండే రాశీఖన్నా, ప్రస్తుతం ‘సుప్రీమ్‌’లో నటిస్తోంది. సరదాగా , చలాకీగా వుండే ఈ భామ అందుకు కారణం కూడా చెబుతూ ఓ పెద్ద స్పీచ్ ఇచ్చేస్తోంది. ‘జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకూడదు. అప్పుడు కష్టాలూ, కన్నీళ్లు తప్ప ఏం కనిపించవు. సరదాగా గడపడం కూడా తెలిసుండాలి. నా సరదాలు నాకున్నాయి. సినిమాలో బిజీ అయిపోయినా వాటిని వదల్లేదు. స్నేహితులతో పార్టీలకు ఇప్పుడూ వెళ్తుంటా. పబ్‌లలో ఎక్కువగా కనిపిస్తానంటే దానికి కారణం అదే. రాత్రంతా గంతులేసినా... పొద్దుటే మళ్లీ నూతన ఉత్సాహంతో సెట్‌కి వెళ్లిపోతా. నలుగురితో సరదాగా ఉండడంలో తప్పులేదు. దీని గురించి ఎవరేం అనుకొన్నా నేను పట్టించుకోను గాక పట్టించుకోను. నా ఉత్సాహం, ప్రతిభ, అదృష్టం...ఈ మూడే నా స్థాయికి కారణం’ అని వివరించింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో మరికొన్ని చిత్రాల్లో కూడా ఈ అమ్మడు సందడి చేయనుంది.

English summary

Telugu Leading Heroine Rashi Khanna presently acting in Supreme Movie along with Sai Dharam Tej.Rashi Khanna says that she will enjoy her life as she wants.Rashi says that she will goto pub and their she will enjoy their and next day she will goto shooting regularlly.Everybody have to enjoy their life as they want.