ఇదంతా ఉప్పు , కారం , మసాలా మహిమ ..

Rashi Khanna About South Movies

12:31 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Rashi Khanna About South Movies

తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎంతో కాలం అవ్వలేదు అయినా ఆమెలో ఎంతో మార్పు. ఆమె ఎవరో కాదు రాశిఖన్నా... ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌ తేజ్‌తో ‘సుప్రీమ్‌’, గోపీచంద్‌తో ‘ఆక్సిజన్‌’ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రవితేజతోనూ ఓ చిత్రం చేయబోతోందట. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే, ఎన్నో అనుభూతులు కనిపిస్తుంటాయి. ఇది సర్వ సాధారణం. సేమ్ ఇదే ఫీలింగ్ తో వున్న రాశిఖన్నా తొలినాళ్లతో పోలిస్తే నేను చాలా మారిపోయానంటోంది. దీనికి పెద్ద థియరీ కూడా చెబుతోంది. ‘‘మనం లో రోజు రోజుకీ చాలా మార్పులొస్తుంటాయి. కొన్ని గమనిస్తాం. మరికొన్ని గమనించం అంతే. ఇక నా వరకూ నేను తెలుగు పరిశ్రమలోకి వచ్చాక చాలా మారిపోయా. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కథానాయికలు బొద్దుగా కనిపిస్తేనే దక్షిణాది ప్రేక్షకులు ఇష్టపడతారని అప్పట్లో ఎక్కడో విన్నట్టు గుర్తు. అందుకే నా తొలి తెలుగు సినిమాలో బొద్దుగా కనిపించా. కానీ ఆ తర్వాత పాత్రలకి తగ్గట్టుగా నా ఆకారం మారింది. ఇక అప్పట్లో ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా తినేదాన్ని . అయితే దక్షిణాదికొచ్చాక వాటినీ బాగా అలవాటు చేసుకొన్నా.విచిత్ర మేమంటే, అప్పట్లో కారం తక్కువ తిన్నా సరే, ముక్కుమీదే కోపం ఉండేది. కానీ ఆ కోపం నాలో ఇప్పుడు మాయమైంది. వ్యక్తిగా, నటిగా కూడా నాలో ఎంతో మెచ్యూర్టీ కనిపిస్తోంది. మరి చాలా మారానా లేదా? 'అంటూ ప్రశ్నిస్తోంది రాశిఖన్నా...

English summary

1Rashi Khanna who had entered as heroine in Telugu Films with Uhalu Gusa Gusa Ladey Movie was become the crazy heroine in tollywood.Presently she was acting in Supreme with Sai Dharam Tej and Oxygen with Gopi Chand movie.