రెండో ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నా

Rashi Khanna Purchases A House In Hyderabad

03:24 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Rashi Khanna Purchases A House In Hyderabad

గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఇంచుమించు నటి  రాశీ ఖన్నా కూడా అలానే అంటోంది. రాశి ప్రస్తుతం ఆమె ‘సుప్రీమ్‌’తోపాటు గోపీచంద్‌తో కలిసి ‘ఆక్సిజన్‌’లో నటిస్తోంది. త్వరలోనే రవితేజతో ఓ చిత్రం చేయబోతోంది. "చిన్నప్పుడు ఇంట్లో గడపాలంటే బోర్‌ అనిపించేది. స్నేహితులతో కలిసి ఎప్పుడెప్పుడు షికారుకి వెళ్దామా అని మనసు తహతహలాడేది. అదేంటో తెలియదు కానీ పెద్దయ్యే కొద్దీ ఇంటిపై మమకారం పెరిగింది. ఇప్పుడు ఖాళీ దొరికితే చాలు ఇంట్లో గడిపేందుకే ప్రాధాన్యమిస్తా. ఇంట్లో ఉన్నంత ఆనందం నాకు మరెక్కడా దొరకదు.  హీరోయిన్ అవ్వడం వలన  తరచూ కొత్త ప్రదేశాలు చూస్తున్నా. విదేశాలూ తిరుగుతున్నా. అయినా, ఇంటిపైనే మనసు లాగుతుంటుంది. మొన్నటిదాకా మా ఇల్లు డిల్లీలోనే ఉండేది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఓ ఇంటిని ఏర్పాటు చేసుకొన్నా. పని అయిపోగానే ఇంట్లో వాలిపోవడం... హాయిగా టీవీ చూడడం, పుస్తకం చదవడం ఏదోలా గడచిపోతుంది.  అసలు ఆ మజానే వేరు’’ అంటూ చెబుతోంది ఈ ముద్దు గుమ్మ. 

రాశిఖన్నా నటిస్తున్న సుప్రీమ్ చిత్రం వివరాలు స్లైడ్ షోలో.....

1/7 Pages

ప్రొడ్యూసర్

ఇంతకు ముందు సాయిధరమ్ తేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం ,  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు తీసిన దిల్ రాజు సుప్రీమ్ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

English summary

Rashi Khanna Who introduced with the movie Uuhalu Gusa Gusa Lade in Tollywood.And later she grabbed many movies and at present she was acting in Supreme With Sai Dharam Tej and Oxygen with Hero Gopichand.Recently she purchased a house in Hyderabad and she says that homeis the best place ever in the world.